ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: కోవిడ్ తరువాత వర్తక, వ్యాపారస్తులు తమ వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనికి సరైన పరిష్కారం చూపి, వారి వ్యాపారం పూర్వ దశకు వచ్చే విధంగా బిజినెస్ నెట్‌వర్క్ క్లబ్ ( బిఎన్‌సి ) కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపకులు అమిత్ జిందాల్ అన్నారు. నగరంలోని ఓహౌటల్‌లో విజయవాడ బిజినెస్ నెట్‌వర్క్ క్లబ్ మంగళవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా అమిత్ జిందాల్ మాట్లాడుతూ ఒకప్పుడు విజయవాడ నగరం వర్తక, వ్యాపార సంస్థలకు దేశంలోనే ప్రసిద్దిగా ఉండేదన్నారు అయితే కోవిడ్ తరువాత వివిధ వ్యాపారస్తులు తమ వ్యాపార లావాదేవీలు సక్రమంగా లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే వ్యాపారస్తుల మద్య వారదిగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యాపార విస్తరణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థలో 153 మంది సభ్యులతో ప్రారంభించామని త్వరలో గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కూడా విస్తరించి వ్యాపారస్తులకు వారధిగా ఉంటూ వారి వ్యాపార అభివృద్దికి కృషి చేయనున్నట్లు తెలిపారు. వ్యాపారస్తులకు సహకారం అందించడంతో పాటు వ్యాపారాభివృద్దికి సంబంధించి అవసరమైన వారికి వివిధ నిపుణులతచే తగిన విధంగా శిక్షణ కూడా ఇప్పించి వారి వారి అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే తమ క్లబ్‌లోని సభ్యులు తమ వ్యాపారాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో మరింత మందిని సభ్యులగా చేర్చుకుని సంస్థ అభివృద్దికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు వ్యాపారస్తులు , నగర ప్రముఖులు పాల్గొన్నారు.










