Nov 03,2023 21:31

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

బద్వేలు : బిజెపితో వైసిపి దోస్తీ ఓటమికి దారి తీస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్‌ పేర్కొన్నారు. స్థానిక కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో శుక్రవార సిపిఎం బద్వేల్‌ పట్టణ కమిటీ సమావేశం పసుపుల మోక్షమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపితో దోస్తీ చేసిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా మనుగడ కొనసాగించలేదని చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాలలో దోస్తీ చేసిన ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీ లను బిజెపిలోకి పార్టీ కిరాయింపులకు పాల్పడి మిత్ర ద్రోహం చేస్తోందన్నారు. మన రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంటుండడంతో మైనార్టీలు, దళితులు దూరమయ్యారని, వైసిపి ఓటమికి దారితీస్తుందని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యేలు బిజెపి వేసిన ఉచ్చులో పడి పోతున్నారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఊడిగం చేయడం తప్ప రాష్ట్ర అభివద్ధి, జిల్లా అభివద్ధి వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. వైసిపి దష్టిలో అభివద్ధి అంటే బటన్‌ నొక్కడం, నవరత్నాలే అని అన్నారు. గ్రామీణ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివద్ధిని, పట్టణ ప్రాంతాల్లో ఉండే అసంఘటిత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం అని పేర్కొన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించడమేనని పేర్కొన్నారు. బద్వేలు మున్సిపాలిటీ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.130 కోట్ల ఖర్చు వివరాలు పట్టణ ప్రజలకు శ్వేత పత్రం ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైసిపి సొంత పార్టీ కౌన్సిలర్లే దీనిపై ప్రశ్నిస్తున్నారని వారికీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ పాలకవర్గం ఉందన్నారు. కార్యక్రమంలో బద్వేల్‌ పట్టణ కార్యదర్శి కె. శ్రీనివాసులు, బద్వేల్‌ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పటాన్‌ చాంద్‌ భాష , కే.నాగేంద్రబాబు, పట్టణ కమిటీ సభ్యులు షేక్‌.మస్తాన్‌, జి.అనంతమ్మ, ఎలక రాజు డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం. చిన్ని పట్టణ నాయకులు షరీఫ్‌ ఆంజనేయులు సురేంద్ర సురేషు మహిళా సంఘం నాయకురాలు గౌతమి మస్తాన్‌ బి బాలమ్మ సిఐటియు నాయకులు సుబ్బరాయుడు, రాజగోపాల్‌ , కొండయ్య , కార్యకర్తలు పాల్గొన్నారు.