Apr 20,2023 00:09

జోన్‌ కమిటీల ఆధ్వర్యంలో

ప్రజాశక్తి- యంత్రాంగం
హొహొ హొమధురవాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మధురవాడ జోన్‌ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఆరో రోజున టైలర్స్‌ కాలనీ, డాక్‌యార్డు కాలనీ, శ్యాంనగర్‌, దోభీ కాలనీ ప్రాంతాల్లో ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం, సిపిఐ జోన్‌ కార్యదర్శులు డి.అప్పలరాజు, వి.సత్యనారాయణ మాట్లాడుతూ, 26న కూర్మన్నపాలెంలో నిర్వహించే ప్రచారభేరి బహిరంగసభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు డి.కొండమ్మ, బి భారతి, ఎ.గురుమూర్తి రెడ్డి, సిపిఐ కార్యకర్త వి సన్నిపాత్రుడు పాల్గొన్నారు.
గాజువాక: హొకేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు అప్రజాస్వామికమని సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు అన్నారు. శ్రీనగర్‌, సుందరయ్య కాలనీ, దశమకొండ ప్రాంతాల్లో ఇంటింటా హొకరపత్రాలు పంపిణీ చేశారు.వామపక్షాల ప్రచార భేరి పాదయాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. నేతలు నర్సింగరావు, లోకేష్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.హొ
పద్మనాభం:దేశాన్ని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం అత్యంత ఆవశ్యమని సిపిఎం నేత రవ్వ నరసింగరావు అన్నారు. బుధవారం మండలంలోని పద్మనాభం, కృష్ణాపురం గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారభేరి పాదయాత్రలను నిర్వహించారు.కార్యక్రమములో ఆదినారాయణ, రాము, అప్పారావు, గురువులు పాల్గోన్నారు.
సింహాచలం: హొకేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేత బి.వెంకటరావు మండిపడ్డారు. మోడీ విధానాలకు నిరసనగా ప్రచారభేరిలో భాగంగా బుధవారం 98వ వార్డు మార్కెట్‌ వద్ద సిపిఎం గోపాలపట్నం జోన్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.కార్యక్రమంలో సిపిఎం నేతలు ముద్దాడ వరప్రసాద్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.
మాధవధార: బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న సాయంత్రం నాలుగు గంటలకు హొకూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం సీనియర్‌ నాయకులు సనపల రామ్‌గోపాలరావు, కె సుధాకరరావు కోరారు. మాధవధార. 48ఏ బస్‌స్టాప్‌ వద్ద దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. వాల్‌పోస్టర్ల ఆవిష్కరణలో సిపిఎం నేతలు నాయనబాబు, నర్సింగరావు, శ్రావణ్‌కుమార్‌, పి.పాండురంగారావు, రాజశేఖర్‌, ఎస్‌.సత్యమూర్తి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌, విశాఖ : జగదాంబ జోన్‌ పరిధిలోని హొగొల్లలవీధి, లలితాకాలనీ ప్రాంతాల్లో జ్యోతీశ్వరరావు అధ్యక్షతన ప్రచార భేరి పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం నాయకులు వై.రాజు సిఐటియు జగదాంబ జోన్‌ జనరల్‌ సెక్రటరీ చంద్రమౌళి, డివైఎఫ్‌ఐ నాయకులు సంతోష్‌, హోటల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రామారావు, ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.సుబ్బారావు, ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అప్పలరాజు, గణేష్‌, భవన నిర్మాణ కార్మిక నాయకులు కె.నర్సింగరావు పాల్గొన్నారు.
సబ్బవరం:బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి హొపిలుపునిచ్చారు. ప్రచార భేరిలో భాగంగా మండలంలోని వంగలి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. హొ సిపిఎం నాయకులు ఉప్పాడ సత్యవతి, యర్రా సోంబాబు, చిన్నికృష్ణ, రామునాయుడు, సోము నాయుడు పాల్గొన్నారు.
చోడవరం : ప్రచార భేరిలో భాగంగా సిపిఎం నాయకులు బుధవారం మండలంలోని లక్కవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు ఎస్‌వి నాయుడు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, బ్యాంకులు, ఎల్‌ఐసి, వాడరేవులు, రైల్వే, విద్యుత్‌ ప్రాజెక్టులు, గనులు కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి దేవుళ్ళు, జోగా రాము పాల్గొన్నారు.