Apr 22,2023 23:22

తునిలో ప్రచార భేరి నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు

తునిలో సిపిఎం ప్రచారభేరి
ప్రజాశక్తి - కోటనందూరు (తుని)
ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాది బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడు కుందాం... ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం... అంటూ సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సభ్యురాలు కె.బేబి రాణి ఆధ్వర్యంలో శనివారం తునిలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలపై పన్నుల భారాలు తగ్గించాలని, పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలు తగ్గించాలని తుని గొల్ల అప్పారావు సెంటర్‌ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ తుని మున్సిపల్‌ కార్యాలయం వరకు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా బేబి రాణి మాట్లాడుతూ. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతి వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిల తీయవలసిన సమయం వచ్చిందని. మోడీ అమిత్‌షాల నాయ కత్వంలో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమిలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ప్రజల మధ్య మత విద్వేషం రాజేస్తున్నా యన్నారు. మరోవైపు అదాని, అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను కారు చవకగా దోచిపెడుతోందని, దీనిపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిరంకుశంగా అణిచివేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న స్వతంత్రం ప్రమాదంలో పడిందని. జాతీయోద్యమ స్ఫూర్తితో దేశ స్వతంత్ర .ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని... ప్రజలందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులను మనం కట్టిన పనులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలనే ఓడరేవుల్ని ఆఖరికి మన అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో గ్యాస్‌ బండ గుదిబండగా మారిపోయిందని, కరెంట్‌ బిల్లులు ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నట్టుగా రేట్లు పెంచారని. నిరుద్యోగుల బతుకులు అగాధంలోకి జారిపోతున్నాయన్నారు. కార్మికులకు కనీస వేతన అమలు చేయటం లేదని, పేదలకు ప్రాణాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సైతం మోడీ ప్రభుత్వం అటకెక్కించిందనాఉ. మహిళలకు రక్షణ లేకపోగా దాడులు పెరిగాయని, దళితులు, గిరిజన ప్రజలు సంక్షేమానికి సామాజిక న్యాయానికి. దూరమైపోతున్నారన్నారు. మోడీ బిజెపిని గద్దె దించాలని. ఈ నెల 26వ తేదీన కాకినాడలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సభ్యులు నక్కెళ్ళ శ్రీనివాస్‌, ఎస్‌కె. పద్మ, బి.నాగేశ్వరరావు జి.రమణ ఎం.కామేశ్వరి, సాక్షి దేవి, గనిరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు