Oct 14,2023 22:42

ప్రజా రక్షణ భేరీ యాత్రలో సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు
ప్రజాశక్తి-ఉంగుటూరు (గన్నవరం) :
ప్రజలను కష్టాలకు గురి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి కె.నరసింహారావు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికై, గన్నవరం నియోజక వర్గంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరీ యాత్ర ఉంగుటూరు మండలం లో శనివారం తరిగొప్పల, చికినాల, బొకినాల, వేంపాడు, మానికొండ మరో ఏడు గ్రామాల్లో కొనసాగింది. పలు గ్రామాల్లో ప్రధాన కూడళ్ళలో నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రజల సమస్యలు ఏమీ పట్టించుకోకుండా కార్పోరేట్ల సేవలో తరి స్తుందన్నారు. ప్రజలను మరిన్న కష్టాలకు గురి చేసి సంపదనంతా అంబానీ, అదానీ, మరికొంత మంది పెద్దలకు దోచి పెడుతుందన్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యవసాయాని రంగాన్ని నిర్వీర్యం చేసే నల్లచట్టాలను తెచ్చిన బిజెపికి పార్లమెంటులో మద్దతు తెలుపుతున్న టిడిపి, వైసీపిలు, బిజెపితో కలిసి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నాయని, రాబోయే రోజుల్లో స్మార్ట్‌ మీటర్లు పెట్టి మరింత భారం మోపనున్నాయన్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌,నిత్యవసర వస్తువులకు తోడుగా ఇది ప్రజలపై పెనుభారం అయ్యిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రతి ఏటా బడ్జెట్‌ లో నిధులలో కోతలు విధిస్తూ ఈ పథకానికి పేదలను దూరం చేసి వారి ఉపాధి పై దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై నిఖరంగా నిలబడి సిపిఎం పోరాడు తుందన్నారు. సిపిఎం కష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లాకుల వెంకట లక్ష్మణస్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరావు, ఉంగుటూరు మండల పార్టీ కార్యదర్శి అజ్మీర వెంకటేశ్వ రరావు మాట్లాడుతూ.. పాలకుల విధానాలపై ద్వజ మెత్తారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, మండల కమిటీ సభ్యులు కె. రామరాజు, పులి శ్రీనివాసరావు, సలీం, టి.వి. రామ్మోహన్‌, కె.సీతా రామరాజు, పార్టీ సీనియర్‌ నాయ కులు పిల్లి రాజారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు కొండలు, ప్రభుదాసు అలపించిన విప్లవగీతాలు ఎంతగానో అకట్టుకున్నాయి.