Apr 25,2023 19:30

దేవనకొండలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - పెద్దకడబూరు
కేంద్రంలోని బిజెపిని ఇంటికి సాగనంపి, దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ నాయకులు కోరారు. మంగళవారం సిపిఎం, సిపిఐ ప్రచార భేరి రంగాపురం గ్రామంలో సాగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు మబ్బు ఆంజనేయ, సిఐటియు మండల కార్యదర్శి ఉప్పర ఈరన్న మాట్లాడారు. రంగాపురం గ్రామంలో డ్రెయినేజీలను వెంటనే శుభ్రం చేయించాలని డిమాండ్‌ చేశారు. రంగాపురం అయ్యప్ప, నాగేంద్ర, పెద్ద అయ్యన్న, తారాపురం గిడ్డయ్య, మునెప్ప, రమేష్‌, ఆంజనేయ, నరసప్ప పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని కె.వెంకటాపురం, పల్లెదొడ్డి, గద్దెరాళ్ల గ్రామాల్లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.వీరశేఖర్‌, ఎమ్‌.నరసరావు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ ఆపాలని, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ, సిపిఎం మండల నాయకులు సూరి, శ్రీనివాసులు, రవి రాజు, నగేష్‌ పాల్గొన్నారు.