బిజెపిని ప్రశ్నించకుంటే దేశ భవిష్యత్తు అంధకారం
ప్రజాశక్తి - ఆత్మకూరు
బిజెపిని ప్రశ్నించకుంటే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు అన్నారు. ఈనెల 14 నుండి 30 వరకు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరిలో శనివారం నందికొట్కూరు పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర భారత్ కాంప్లెక్స్ అవరణంలో ముగింపు సభ నిర్వహించార. ఈ సభకు సిపిఎం వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం విధానాలను నిలదీయాలన్నారు. బిజెపి ఆదాని, అంబానీ లాంటి అధిసంపదలకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిరంకుశంగా కేసులు వేస్తూ దాడికి పాల్పడుతూ అణిచివేస్తున్నా రన్నారు. నాడు అనేకమంది త్యాగదనులు బ్రిటిష్ వలస పాలనను ఎదిరించి తరిమికొట్టి మనకు స్వాతంత్రం తెచ్చారన్నారు. నేడు అదే స్వాతంత్రం పెను ప్రమాదంలో పడింది దానిని ఈ దేశ ప్రజలమైన మనం కాపాడుకోవడానికి జాతీయోద్యమ స్ఫూర్తితో మళ్ళీ జాతీయస్థాయిలో ఈ కేంద్ర ప్రభుత్వ బిజెపిని గద్దె దింపాలని అన్నారు. సామాన్య ప్రజలకు అండగా ఉండడం పోయి వారి మీదే మోయలేని విధంగా భారాలు వేస్తోందన్నారు. బిజెపి పాలనలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పథకాన్ని సైతం మోడీ ప్రభుత్వం అట్టగెక్కించిందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు , సిపిఎం నాయకులు ఏం కర్ణ, కెవిపిఎస్ జిల్లా నాయకులు కే. రంగమ్మ గంధం హుస్సేనమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్, సిపిఎం నాయకులు జయ,నరసింహ, ఏసన్న, నారాయణ,రవి, లోకేష్ లక్ష్మీదేవి, మస్తాన్, సుబ్బమ్మ,తదితరులు పాల్గొన్నారు.










