ప్రజాశక్తి - పల్నాడు జిల్లా విలేకర్లు : అన్ని వర్గాల ప్రజల హక్కులను హరిస్తూ నిరంకుశ విధానాలతో పాలిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్మిక నాయకులు పిలుపుని చ్చారు. ఇందుకోసం కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఇతర రంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడుకోవడానికి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9న మహాధర్నాలకు కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు పిలుపులో భాగంగా విజయవాడలో మహాధర్నాను నిర్వహించనున్నారు. దీని జయప్రదం కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా రెండ్రోజుల జీపుజాతాను చిలకలూరిపేట పట్టణంలోని ఎన్‌ఆర్‌టి సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జాతా వినుకొండ, మాచర్లలోనూ కొనసాగింది. చిలకలూరిపేటలో వి.రాధా కృష్ణమూర్తి మాట్లాడుతూ బిజెపి విధానా లతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్న ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని, మణి పూర్, హర్యానాలో అల్లర్లు ఆ కుట్రలో భాగాలేనని విమర్శించారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, ఇతర బలహీన వర్గాలపై నిత్యం దాడులు జరుగుతున్నారని, ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రకృతి వనరులను అదాని, అంబానీ వంటి కార్పొరేట్లకు కేంద్రం దోచిపెడుతోందని దుయ్యబట్టారు. మణి పూర్‌లోని అటవీ సంపదను కొల్లగొ ట్టడానికి అక్కడ చిచ్చు రేగ్గొట్టారని అన్నారు. కార్మిక హక్కులను హరిస్తున్న ఈ ప్రభుత్వం కొనసాగితే కార్మికులు బానిసల వుతారని, వ్యవసాయం కార్పొరేట్ల చేతు ల్లోకి వెళ్లి దేశం ఆహార సంక్షోభానికి దారితీ స్తుందని ఆందోళన వెలిబుచ్చారు. సిఐటి యు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని అధికార వైసిపి అమలుకు పూనుకుందని, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి, చెత్త పన్నుల భారాలు, విద్య, సహకార, రవాణా రంగా ల్లో ప్రమాదకర మార్పులు అందులో భాగ మని వివరించారు. మైనార్టీలు, ఇతర సామాజిక తరగతులపై సంఘ పరివారం చేస్తున్న దాడులపై వైసిపి, టిడిపి, జనసేనలు నోరు విప్పటం లేదన్నారు. ఎఐటియుసి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ప్రజల వేతనా లు మాత్రం తగ్గుతున్నాయని, పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెరుగుతోందని ఆందో ళన వ్యక్తం చేశారు. సంపద మొత్తం కొద్దిమంది బడా కార్పొరేట్ల వద్ద పోగుబడు తోందని చెప్పారు. బిజెపి ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల ప్రజలూ ఆర్థికంగా దెబ్బతింటారని, జీవన పరిస్థి తులే కష్టమవుతాయని అన్నారు.
వినుకొండలోని శివయ్యస్తూపం సెంటర్లో జాతా వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడారు. మోడీ పాలనలో కార్మికుల మేలు చేయకపోగా చట్టాలను నీరుగార్చేలా లేబర్ కోడ్‌లను తెచ్చారన్నారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలను పెంచలేదని, సామాజిక భద్రత పథకాన్ని ప్రకటించలేదని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలును విస్మరించారని అన్నారు. ఓపీఎస్ పునరుద్ధరణ, కనీస పెన్షన్ రూ.9 వేలకు పెంచాలనే డిమాండ్లనూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రతిఏటా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటుంటే కనీసం జాతీయ కార్మిక సంఘాల నేతలను పిలిచి సమస్యలను వినటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కమ్యూనిస్టుల కృషితో వచ్చిన ఉపాధి హామీ చట్టం కోట్లమంది కూలీలకు ఉపయోగపడుతుంటే దాన్నీ నీరుగార్చే కుట్రలు చేస్తున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని తుంగలో తొక్కారన్నారు. మాచర్లలో చేపట్టిన ప్రచారం ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు మాట్లా డారు. కార్యక్రమాల్లో వివిధ సంఘాల నాయకులు ఎన్.రామసుబ్బాయమ్మ, పి.వెంకటేశ్వర్లు, టి.బాబురావు, పి.రామా రావు, సిహెచ్.నిర్మల, కె.సాంబయ్య, లూథర్, ఎస్.బాబు, అనందకుమార్, యోగయ్య, శరబయ్య, సైదా, బాబు, బి.శ్రీనివాసరావు, పి.వెంకటేశ్వర్లు, డి.వర హాలు, ఆర్.వందనం, పి.మార్కు డి.సాంబ య్య, మల్లికార్జున కె.కోటేశ్వరరావు, చిన్నజానుసైదా, ఫిరోజ్, ఎ.ఆంజనే యులు, సైదా, నాసర్‌బి, తిరుమల లక్ష్మి, బి.మహేష్, ఎం.బాబురావు, ఎస్‌ఎమ్‌డి బాషా, కె.రమణ, విల్సన్ పాల్గొన్నారు.










