Apr 26,2023 23:30

ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం ప్రచారభేరి
ప్రజాశక్తి - కోటనందూరు
ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాది బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రజలపై పన్నుల భారాలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నాయకులు కోటనందురులో, తుని పట్టణంలో గర్ల్‌ హైస్కూల్‌ సెంటర్లో సిపిఎం ప్రచారభేరి బహిరంగ సభను నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు జి. బేబి రాణి మాట్లాడుతూ. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతి వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం వచ్చిందని. మోడీ అమిత్‌షాల నాయకత్వంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి ప్రజల మధ్య మత విద్వేషం రాజేస్తోందని, మరోవైపు అదాని అంబానీ లాంటి అతి సంప న్నులకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిరం కుశంగా అణిచివేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఓడరేవుల్ని, వ్యవసాయన్ని సైతం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగుల బతుకులు అగాధంలోకి జారిపోతు న్నాయని, కార్మికులకు కనీస వేతన అమలు చేయట్లేదని, ఉపాధి హామీ పథకాన్ని అట ఎక్కించిందని, మహిళలకు రక్షణ లేకపోగా దళితుల గిరిజన ప్రజల సంక్షేమానికి సామాజిక న్యాయానికి. దూరమైపోతున్నా రన్నారు. కార్యక్రమంలో సిపిఎం సభ్యులు. ఎస్‌కె పద్మ లోకవరపు బాలరాజు, అప్పల నరస, లోకేశ్వరి నాగలక్ష్మి, లోవా, బాబ్జి, లక్ష్మి , నక్కెళ్ళ శ్రీను ,బత్తిన నాగేశ్వరరావు, లావరాజు రాంబాబు ,వెంకన్న, మంగరాజు, ఉనీసా, మాణిక్యం పాల్గొన్నారు పిఠాపురం : సిపిఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా పట్టణంలోని స్థానిక ఉప్పాడ బస్టాండ్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధాలు నశించాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు డి శేషబాబ్జి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకువస్తూ వాటిని అమలు చేస్తూ కార్మికులు, ప్రజలపై అనేక భారాల మోపుతున్నరన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించవలసింది పోయి కార్పొరేట్లకు కారు చౌకగా కట్టపెట్టేందుకు యోచిస్తోందన్నారు. మరొక్క సారి బిజెపి అధికారంలోకి వస్తే మాట్లాడే హక్కు కూడా ప్రజలందరూ కోల్పోవలసిన పరిస్థితి వస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోనేటి రాజు, కరణం విశ్వనాథం, కె.నాగేశ్వరరావు, మణి, చిన్న ప్రజా సంఘాల నాయకులు డి సత్యనారాయణ, జి వీరబాబు, గోవిందా చారి, సూర్యనారాయణ, ఎస్‌ శ్రీను, గోపాలకృష్ణ, సత్యనారాయణ, రాజబాబు, సోమరాజు, సత్తిబాబు, అప్పన్న, మోహనా చార్యులు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.