Apr 17,2023 21:01

మిడుతూరు మండలంలో చేపట్టిన ప్రచార భేరిలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు ఎం.నాగేశ్వరరావు

 

బిజెపికి రాజకీయ సమాధి
- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు
ప్రజాశక్తి - ఆత్మకూరు

      ప్రజలపై విచ్చలవిడిగా భారాలు వేస్తూ.. నిరంకుశ పాలన సాగిస్తున్న బిజెపికి రాజకీయ సమాధి కట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు పేర్కొన్నారు. సోమవారం మిడ్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచార భేరిని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన విచ్చలవిడిగా పన్నులు వేసి ఆదాని, అంబానీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. మిడుతూరు మండలానికి హంద్రీనీవా ద్వారా సాగు తాగునీరు అందించాలని వారి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి వెంకటేశ్వర్లు, పకీర్‌ సాహెబ్‌, బేస్తరాజు, గోపాలకృష్ణ గ్రామస్తులు వెంకటేశ్వర్లు, సోప్‌ సాహెబ్‌, మనన్‌, జయన్న, కలాం, అజిస్‌, సంజన, ఎలా నాగన్న తదితరులు పాల్గొన్నారు. నంద్యాల రూరల్‌ : నంద్యాల మండలంలోని చాపిరేవుల గ్రామంలో వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బిజెపి పరిపాలనలో ప్రమాదంలో పడిందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎస్‌ బాబా ఫక్రుద్దీన్‌, మండల కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి నా గరాముడు, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, జిల్లా కార్యదర్శి శివయ్య, ఎపి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. పాములపాడు: మండలంలో రెండో రోజు ప్రచారభేరీ కొనసాగింది. లింగాల నాగంపల్లి, చెలిమిల్ల, మద్దూరు, వానాల, మిట్ట కందల గ్రామాలలో జాత నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి సామన్న, సిపిఐ మండల కార్యదర్శి ప్రతాప్‌, సిపిఎం మండల నాయకులు వెంకటేశ్వరరావు, బాలయ్య బిజెపి అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. సిపిఎం నాయకులు హనుమంతు, ఏసేపు, బాల యేసు, ఎస్‌ఆర్‌ రమణ, మహిళా సంఘం నాయకురాలు రవణమ్మ, నాయకులు జయరాజు, రవి, మల్లయ్య పాల్గొన్నారు. పగిడ్యాల: బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపుదామని సిపిఐ మండల నాయకుడు అబ్దుల్‌ మజీద్‌ అన్నారు. మండలంలోని పాతకోట గ్రామంలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలాం, రమణ, భీముడు, వెంకటేశ్వర్లు, రహిమాన్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు. చాగలమర్రి : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను నిలదీయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు,సహాయ కార్యదర్శి బాబాఫకృధ్ధీన్‌ అన్నారు. చాగలమర్రి పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రచారభేరి యాత్ర నిర్వహించారు. యాత్ర స్థానిక అడ్డవాగు సెంటర్‌ నుండి మైన్‌బజార్‌, గాంధీó సెంటర్‌, పెద్దమకానం, ముత్యాలపాడు బస్టాండు వరకు సాగింది. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు,ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ, ఆళ్ళగడ్డ సిపిఐ కార్యదర్శి భాస్కర్‌,రుద్రవరం కార్యదర్శి బాలనరసింహులు, వెంకటేశ్వర్లు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. డోన్‌: మండలంలోని పలు గ్రామాలలో 4వ రోజు సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల,పట్టణ కార్యదర్శిలు కే.నాగరాజు, నక్కీశ్రీకాంత్‌లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోచుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయలేకపోయిందన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ మండల కమిటీ సభ్యులు చిన్నరహిమాన్‌,షమీం బేగం,నక్కి హరి, అశోక్‌,రత్న జయమ్మ, సుధాకర్‌, చరణ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌ : చాపిరేవుల గ్రామంలో ప్రచార భేరి కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు
నంద్యాల రూరల్‌ : చాపిరేవుల గ్రామంలో ప్రచార భేరి కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు