Sep 21,2022 23:18

కరాసలో ప్రచారం చేస్తున్న సిపిఎం నేతలు

పలుచోట్ల దేశ రక్షణ భేరి పోస్టర్ల ఆవిష్కరణ
27న బహిరంగ సభకు తరలిరావాలని పిలుపు
ప్రజాశక్తి- పెందుర్తి
: బిజెపి పాలన నుంచి దేశాన్ని విముక్తి కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశ రక్షణ భేరి ప్రచారోద్యమ పోస్టర్లను బుధవారం పెందుర్తి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్‌ కార్యదర్శి బి. రమణి మాట్లాడుతూ ఈనెల 14 నుంచి ప్రారంభమైన ప్రచారోద్యమ పాదయాత్రలను ఈ నెల 27 వరకు కొనసాగిస్తామన్నారు. 27న సరస్వతి పార్కు నుంచి ర్యాలీ, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఇతర ముఖ్యనేతలు హాజరెౌతారన్నారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్‌ కమిటీ సభ్యురాలు లావణ్య, జోన్‌ నాయకులు శంకరరావు, జగన్నాథ స్వామి, సింహాచలం, అప్పలనాయుడు, అప్పారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
ములగాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై సిపిఎం ఎక్కుపెట్టిన దేశ రక్షణభేరి ప్రచారోద్యమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం నేతలు కోరారు. బుధవారం వెంకన్న పాలెం సిపిఎం కార్యాలయంలో సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు.కార్యక్రమంలో మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, ఆర్‌.లక్ష్మణమూర్తి కె.పెంటారావు, జి.సన్యాసిరావు ఎం.కష్ణరావు, ఎం ఆర్‌ కె జనార్ధనరావు పాల్గొన్నారు.
కరాస: దేశ రక్షణ భేరిని జయప్రదం చేయాలని కాకానినగర్‌, విమాననగర్‌, కనకమహాలక్ష్మి నగర్‌, వినోద్‌ నగర్‌ ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ప్రచారంలో గోపాలపట్నం కార్యదర్శి వెంకటరావు, ఐద్వా గోపాలపట్నం డివిజన్‌ అధ్యక్షురాలు వి.ప్రభావతి, జి నారాయణరావు, ఎం నారాయణరావు, అన్నపూర్ణ,లీల, రమణ, చిన్న రమణ, నీలిమ పాల్గొన్నారు.