ప్రజాశక్తి-వన్‌టౌన్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవంలభిస్తోన్న విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని, దీని వల్ల ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి. నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ భవానీపురం చర్చి సెంటర్ నుండి ప్రారంభమై సితార, సొరంగం, చిట్టినగర్, గొల్లపాలెంగట్టు, పంజా సెంటర్, తారాపేట మీదుగా సామారంగ్ చౌక్ వరకు కొనసాగింది. ర్యాలీని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు కె.వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆస్తులతో నిర్మించబడిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటుపరం చేస్తూ ప్రజల ఉపాధికి గండి కొడుతున్నారన్నార. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న బిజెపికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నారాయణ, వెంకట్రావు, సూరిబాబు, సుబ్బారెడ్డి, దాసు, సత్యబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ: సిఐటియు నాయకులు బందర్ రోడ్డు, బీసెంట్‌రోడ్డు, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు ఎ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎంవి సుధాకర్, సిఐటియు నాయకులు ఎం బాబూరావు, వై సుబ్బారావు, ఎంవి రమణ, టి ప్రభుదాస్, జి కొండ, హాకర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నందిగామ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నందిగామ సీఐటీయూ కార్యాలయం దగ్గర నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల్లో తిరుగుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్, సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, వల్లూరు రవి శేఖర్, కరి వెంకటేశ్వరరావు, ఎం.శీనివాసరావు, వేల్పుల ఏసోబు, లాజరు, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్, ఎస్ కె.హస్సన్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ఎజెన్సీ కార్మికులకు సిఐటియు నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ వర్కర్ సీనియర్ అధ్యక్షులు దుర్గారావు, కార్యదర్శి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు ముసలి ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: మండలంలోని పొలంపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తమ్మినేని రమేష్, రైతు సంఘం మండల కార్యదర్శి తమ్మినేని రాంబాబు, సిఐటియు మండల కార్యదర్శి బి.రాము, కోటేశ్వరరావు వెంకటేశ్వర్లు, వెంకటి, పుల్లయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-రెడ్డిగూడెం: రెడ్డిగూడెం అమర్ భవన్ay పోస్టర్ ఆవిష్కరించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, రైతు సంఘం మండల నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ఎలక్ట్రికల్ వర్కర్ తాల్లడ నాగరాజు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.










