Aug 03,2023 22:34

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

చిలమత్తూరు : మణిపూర్‌లోని మారణకాండను ఖండిచాలని బిజెపి విద్వేష రాజకీయాలను ప్రతిఘటించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మణిపూర్‌ ఘటనను నిరసిస్తూ రూపొందించిన కరపత్రాలను మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కోడూరు గార్మెంట్స్‌ లో పని చెస్తున్నా మహిళలకు సిపిఎం నాయకులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో గత మూడు నెలలుగా సాగుతున్న మారణకాండను మూల కారణమైన బిజెపి విధ్వేష రాజకీయాలని ఖండిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్‌, లక్ష్మినారాయణ, రామచంద్ర, శేషు, రాకీ, అంజి చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.