Aug 02,2023 22:25

పెనుకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పెనుకొండ : మణిపూర్‌ మారణకాండను ఖండించాలని బిజెపి విద్వేష రాజకీయాలను ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి పట్టణ పుర వీదుల గుండా ర్యాలీ నిర్వహించి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్బంగా పలు సర్కిల్‌ లలో, ప్రభుత్వ కార్యాలయాల లో ఉద్యోగులకు, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో మూడు నెలలుగా సాగుతున్న నరమేధాన్ని దానికి మూల కారణమైన బిజెపి విద్వేష రాజకీయాలను ఖండిద్దామన్నారు. ఆడపడుచులను పోలీసుల సమక్షంలో మతోన్మాదులు నగంగా ఊరేగించి వారిపై సామూహికంగా అత్యాచారలు తెగబడ్డారన్నారు. మారణకాండ పట్ల ప్రజానీకం ఆగ్రహానికి లోనైందని మూడు మాసాలుగా ఈ దారుణాలు సాగుతున్న ప్రధాని మోడీ నోరు విప్పలేదని విమర్శించారు. దీని వెనుక కార్పొరేట్‌ శక్తుల స్వార్థపూరిత లాభపేక్ష కూడా ఉందన్నారు. మణిపూర్‌ పర్వతాల్లో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లు కాజేయడానికి వీలుగా అక్కడ నివసించే కుక్కీ లను తరిమి వేయడానికి కుట్రలు పన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్‌, పార్టీ సభ్యులు తిప్పన్న, బాబావలి, గంగాధర్‌, మహబూబ్‌బాషా, వెంకటరాముడు, రాజు రావు, వజ్రంనాగప్ప, నరసింహులు, క్రిష్టప్ప, ఆటో యూనియన్‌ నాయకులు మూర్తి, హనుమంతు, రెడ్డప్ప, మహేష్‌, శ్రీరాములు,గంగయ్య ,అజరు తదితరులు పాల్గొన్నారు.
నల్లమాడ : మణిపూర్‌ రాష్ట్రంలో గత మూడు నెలలుగా సాగుతున్న నరమేధానికి సంబంధించిన కరపత్రాలను సిపిఐ నాయకులు కార్యకర్తలు బుధవారం మండలకేంద్రంలో పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాల వద్ద వీటిని పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్‌ కూడలిలో సిపిఎం నాయకులు గోవిందు తదితరులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోవిందు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో బిజెపి సాగిస్తున్న విద్వేష రాజకీయాలపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరి, హరి, సురేష్‌, రజాక్‌, గణేష్‌, అమర్‌, దస్తగిరి, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : మణిపూర్‌ లో జరుగుతున్న సంఘటనలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాల వద్ద వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
తనకల్లు : మణిపూర్‌ మారణకాండకు వ్యతిరేకంగా రూపొందించిన కరపత్రాలను మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలిలో సిపిఎం నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బడా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో సాగుతున్న నరమేధానికి మూల కారణమైన బిజెపి విద్వేష రాజకీయాల్ని ఎలిగెత్తి ఖండిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివన్న, వివి రమణ, ఎస్వీ రమణ, సిఐటియు నాయకులు ఒంటెద్దువేమన్న, శ్రీనివాసులు, నరసింహారెడ్డి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : మణిపూర్‌ మారణకాండను ఖండిస్తూ బిజెపి విద్వేష రాజకీయాలను ప్రతిఘటించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, సీనియర్‌ నాయకులు మెసేజ్‌ బాషా, సిఐటియు మండల అధ్యక్షులు ఆదినారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరపత్రాలను వారు పంపిణీ చేశారు.
హిందూపురం : మణిపూర్‌ మారణకాండను ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప అన్నారు. ఆగష్టు 8న ఐద్వా ఆద్వర్యంలో విజయవాడలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రికలను విడుదల చేశారు. మణిపూర్‌ లో జరిగే హింస పైన వేసిన కరపత్రాలను మహిళలు పనిచేసే గార్మెంట్స్‌ లో, ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక రంగాల్లో పనిచేసే మహిళలకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, రామాంజప్ప, చంద్ర, బాబయ్య, ఈశ్వరమ్మ, జయమ్మ, లక్ష్మమ్మ, అశ్వర్థమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మణిపూర్‌ మరణకాండను ఖండిస్తూ సిపిఎం నాయకులు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్‌, వెంకటేషులు, మాబు, గంగరాజు, ఎస్‌ చాంద్‌ బాషా, చంద్రశేఖర్‌, రామాంజనేయులు, ఓబులేసు, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.