నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు
ప్రజాశక్తి-విజయనగరం కోట : కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీని కించపరుస్తూ బిజెపి నాయకులు సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుంకరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై బిజెపి నాయకులు రావణాసురుడుగా చిత్రీకరించి పోస్టర్ రిలీజ్ చేయడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్, స్టేట్ ట్రైనింగ్ సెల్ చైర్మన్ డోల శ్రీ నివాస్, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షరీఫ్, సూరి అప్పడు, కరీమ్, మబ్బులు, అప్పారావు, చిలకా రాజు , సూరి బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.










