
పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ప్రజాశక్తి-ఉయ్యూరు : రాష్ట్రంలో వైసీపీని ఓడించి జనసేన, టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుచేసేందుకు భారతీయ జనతాపార్టీ సహకారం కూడా తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పడం తెలివి తక్కువ తనమని, అది ఎంతమాత్రం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయ పడ్డారు. వైసీపీని ప్రభుత్వాన్ని అంత మొందించి జనసేన, టీడీపీ కలసి ప్రభుత్వం. ఏర్పాటుచేసేందుకు బీజేపీతో జతకడతామని కైకలూరు, ముదినేపల్లి ప్రాంతాల్లో వారా హి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఉయ్యూరులోని ఆయన నివాసంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నేడు అరాచక పాలన నడుస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు కలసి వైసీపీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా పరిణతి ఉందని భావిస్తుంటే కొన్ని విషయాల్లో ఏమీ తెలియదాని ఆయన మాటలను బట్టి తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి చేసే అక్రమా .లు, అవినీతి కార్యక్రమాలన్నీ మోదీ, అమితీలకు తెలిసే జరుగుతున్నాయని ఆరోపిం చారు. చంద్రబాబునాయుడు అరెస్టు, జైలుకు పంపడం కూడా బీజేపీ పెద్దల అను మతి తీసుకునే జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగు వేశారన్నది ఆదరికి తెలుసని పేర్కొన్నారు.