Sep 01,2023 22:16

ప్రజాశక్తి - యంత్రాంగం
           కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారాల దెబ్బకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని సిపిఎం నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గతనెల 28వ తేదీ నుంచి ఈనెల నాలుగో తేదీ వరకూ జరిగే సిపిఎం 'సమరభేరి'లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో సిపిఎం నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. అనేకచోట్ల గ్రామసచివాలయాల వద్ద ధర్నా చేపట్టి, అధికారులకు వినతులు అందించారు.
తణుకు : నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలు పరిష్కరించడంలో బిజెపి ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ప్రతాప్‌ ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలో 5, 8, 17, 18, 22 సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎ.అజయకుమారి, గార రంగారావు, త్రిమూర్తులు, బ్రహ్మాజీ, కిరణ్‌, ఎస్‌.శ్రీనివాస్‌, టి.వెంకటేశ్వరరావు, శారద, సత్యవతి, పి.శేషకుమారి, తరుణ్‌ తేజ్‌, గోపాల్‌, గణేష్‌ పాల్గొన్నారు.
గణపవరం : సిపిఎం సమరభేరిని మండలంలోని కేశవరం, పిప్పర, అప్పన్నపేట, జల్లి కాకినాడ, కోమర్రు, తాళ్లపాలెం గ్రామ సచివాలయ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి పి.నరసింహమూర్తి, నరాలశెట్టి రామకృష్ణ, ఎం.పెంటారావు, కేతా శ్రీనివాసు, నక్క లక్ష్మణరావు, గుత్తుల శ్రీనివాస్‌, పి.గోవిందు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.గోవిందు, పి.ఓంకార్‌, చోడదాసి సంజీవరావు, కవల వెంకటేశ్వరరావు, మద్దాల నాగేశ్వరరావు, మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, టి.మహాలక్ష్మి, ఇప్పర్తి సత్యం పాల్గొన్నారు.
తణుకు రూరల్‌ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలిస్తూ పేద ప్రజలపై పెనుభారాలు మోపుతుందని సిపిఎం గ్రామ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు విమర్శించారు. సిపిఎం సమరభేరిలో భాగంగా స్థానిక సచివాలయం-2 వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎన్‌.మౌనికకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసా వెంకటేశ్వరావు, రామకృష్ణ, విశ్వనాథం, సుబ్బారావు, కె.వీరభద్రరావు, వాటాల నాగేశ్వరరావు, నక్క కరుణకుమార్‌, తాళ్ల సత్యనారాయణ, గొల్లపల్లి రాజా, వీరవల్లి వెంకన్న పాల్గొన్నారు.
పెనుగొండ : సిపిఎం సమరభేరిలో భాగంగా కోఠాలపర్రులో సంతకాల సేకరణ చేపట్టినట్లు పార్టీ గ్రామ కార్యదర్శి కౌరు జగన్నాథం తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయం కార్యదర్శి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు, పాలా సత్యనారాయణ, రామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు.
గణపవరం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై భారాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. సిపిఎం సమరభేరిలో భాగంగా కేశవరంలో ఆందోళన చేపట్టారు. అనంతరం సచివాలయ అధికారి రంగారావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడారు.
కాళ : కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను వీడాలని సిపిఎం నాయకులు గొర్ల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సిపిఎం సమరభేరిలో భాగంగా కాళ్ల, ప్రాతాళ్లమెరక, మాలవానితిప్ప గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఆయా గ్రామ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. మండా సూరిబాబు, తిరుమాని శ్రీనివాస్‌, నాగిడి ఆంజనేయులు, గరికముక్కల ఆజమ్మ, పసుపులేటి సత్తిబాబు, నరసింహమూర్తి, యెహోషువ, లాజరు, రవి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మూడోరోజు 13 నుండి 25వ వార్డు సచివాలయాల వద్ద సిపిఎం సమరభేరి నిరసనలు చేపట్టారు. అనంతరం సచివాలయ కార్యదర్శులకు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ మాట్లాడారు. జవ్వాది శ్రీను, మడకా రాజు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, పోతు శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, జవ్వాది శివ, పతివాడ నాగేంద్రబాబు, యడవల్లి వెంకన్న, కొమ్మిరెడ్డి ఉదరు, గొర్రెల వంశీ ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పాలకోడేరు : ప్రజలపై పెనుభారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర వీడాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ హెచ్చరించారు. ప్రజలపై భారాలు వేసి సంపన్నులకు కట్టబెట్టే విధానాలను కేంద్రప్రభుత్వం అవలంభిస్తుందని విమర్శించారు. సిపిఎం సమరభేరిలో భాగంగా విస్సాకోడేరులో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపి పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శేషపు అశ్రియ్య, గ్రామ కార్యదర్శి కలిదిండి గోపాలరాజు, నాయకులు ఖండవల్లి వెంకన్న, చేబోలు శ్రీను, కూర్మారావు, ఎద్దు శ్రీను, కె.ఆనంద్‌, కడలి పోతురాజు పాల్గొన్నారు. పాలకోడేరు సచివాలయ వద్ద ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. వెండ్ర గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు రామారావు, మూర్తి, అప్పారావు, లక్ష్మణస్వామి, నరసింహరాజు, సాల్మన్‌రాజు పాల్గొన్నారు.
నరసాపురం : సిపిఎం సమరభేరిలో భాగంగా ఎన్‌టిఆర్‌ కాలనీ సచివాలయం-11లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నరసాపురం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పొన్నాడ రాము, మంచిలి నీలకంఠం, నోముల కొండ, నాయకులు తాడి నాగభూషణం, మహ్మద్‌ అజిత్‌, పైలా సత్తిబాబు, బద్రి నారాయణరావు, వాసా రామలింగం పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్‌ : సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా మాధవరంలో ప్రజల నుంచి సంతకాలు సేకరించి సచివాలయం అధికారికి వినతిని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుత్తుల నరసయ్య, పురిటిగడ్డ జయమ్మ, గోపాల వెంకటరావు, పరమేష్‌ పాల్గొన్నారు.
భీమవరం : మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను, ధరలను అదుపుచేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, సిపిఎం నాయకులు ఎం.వైకుంఠరావు విమర్శించారు. భీమవరం పట్టణంలో సచివాలయం-20 వద్ద ధర్నా చేసి అధికారులకు వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చైతన్య ప్రసాద్‌, డి.త్రిమూర్తులు, నాగు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, కె.కృష్ణ, సాంబ, నాగేశ్వరరావు, సాయమ్మ, సిహెచ్‌.వరలక్ష్మి, కుమారివెంకన్న పాల్గొన్నారు.
పోడూరు : సిపిఎం సమరభేరిలో భాగంగా స్థానిక పంచాయతీ కార్యదర్శి పి.రవికి ప్రజా సమస్యలపై వినతిని అందించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొంతు శ్రీను, బురాబత్తుల వెంకట్రావు పాల్గొన్నారు.
పెంటపాడు : స్థానిక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. సచివాలయం అధికారి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, నాయకులు సిరపరుపు రంగారావు, కర్రి నాగిరెడ్డి, కొవ్వూరు రామిరెడ్డి, గిద్ద శ్రీను, వీరబత్తుల ప్రసాద్‌, కె.శ్రీను పాల్గొన్నారు.
మొగల్తూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న అధిక భారాలను ఉపసంహరించుకోవాలని మండలంలోని సచివాలయాల వద్ద సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఎడ్ల చిట్టిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి నాగరాజు పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : సిపిఎం సమర బేరిలో భాగంగా మండలంలోని వెంప గ్రామంలో నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం సచివాలయ కార్యదర్శి జి.కృష్ణమోహన్‌కి వినతిని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేగి ప్రసాద్‌, నేతల కృపానందం, ఈద భూషణం మందమార్తమ్మ, చిలకపట్టు శకుంతల, గూడూరి సత్య, పూర్ణిమ, కింబూరి రమణమ్మ, బాలం సక్కుబాయి, భారు పాల్గొన్నారు.
వీరవాసరం : ధరలను అదుపు చేయలేని ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలంటూ సిపిఎం నేతలు ప్రజలకు పిలుపునిచారు. సమరభేరిలో భాగంగా మండలంలో వివిధ సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరపాలెంలో విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ అధికంగా బిల్లు వచ్చిన రశీదులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు జుత్తిగ నరసింహమూర్తి కేతా జ్యోతిబసు, పాలా కోటేశ్వరావు, జుత్తిగ సాంబియాంభ, యాళ్లబండి నారాయణమూర్తి, కేతా దానయ్య, జుత్తిగ శ్రీనివాస్‌, మైగాపుల త్రిమూర్తులు పాల్గొన్నారు.
యలమంచిలి : సిపిఎం సమరభేరిలో భాగంగా మండలంలోని చించినాడ, యలమంచిలి, ఏనుగువాని లంక, కలగంపూడి, కట్టుపాలెం, కాంబోట్లపాలెం, ఇలపకుర్రు, దొడ్డిపట్ల తదితర గ్రామాల్లోని సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కరెంట్‌ బిల్లులు దహనం చేసి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల కార్యదర్శి కానేటి బాలరాజు, నాయకులు దేవ సుధాకర్‌, గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, మాసవరపు సుబ్బారావు, గుబ్బల చక్రపాణి, పి.జార్జిబాబు, ఇంజేటి శ్రీనివాస్‌, అంబటి రంగనాయకులు పాల్గొన్నారు.
ఉండి : మండలంలోని పాములపర్రు, ఉండి, యండగండి, ఎన్‌ఆర్‌పి అగ్రహారం, చెరుకువాడ, అర్తమూరు, పాందువ్వ గ్రామ సచివాలయాల వద్ద సిపిఎం సమరభేరి నిరసనలు చేపట్టారు. అనంతరం ఆయా సచివాలయ కార్యదర్శులకు వినతులు అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌ మాట్లాడారు. ఆయా కార్యక్రమంలో నాయకులు చీర్ల శేషు, నిమ్మితి కిషోర్‌, రామకూరి వెంకటరత్నం, వీరవల్లి మాధవరావు, వీరవల్లి శ్రీనివాస్‌, కిల్లారి తవిటినాయుడు, మామిడాల నాగేశ్వరరావు, కింతాడ రమేష్‌ పాల్గొన్నారు.
ఆకివీడు : స్థానిక సచివాలయం-5 వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పెంకి అప్పారావు మాట్లాడారు. అనంతరం సచివాలయ కార్యదర్శి నిర్మలకుమారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ లావణ్య, బివి.వర్మ, షేక్‌ వలి, గోపిశెట్టి రాణి, పి.కృష్ణవేణి, గేదెల రాము, బి.కల్యాణి, ఎ.సతీష్‌ పాల్గొన్నారు.