Oct 22,2022 23:34

సమావేశంలో పాల్గొన్న సిపిఎం కార్యకర్తలు

ప్రజాశక్తి-చింతూరు
కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం నేతలు సీసం సురేష్‌, పల్లపు వెంకట్‌ పిలుపునిచ్చారు. మండలంలోని ఏడుగురాళ్లపల్లి తుమ్మలలో శనివారం జరిగిన సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలతో కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తుందన్నారు. జీఎస్టీ తీసుకొచ్చి ప్రజలపై మరిన్ని బారాలు మోపిందని, అది చాలదన్నట్లు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచిందని విమర్శించారు. బిజెపికి ప్రజలందరూ ఐక్యంగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆదివాసీలను బలహీనపరిచేందుకే నేడు 52 జీవో ద్వారా వాల్మీకి, బోయ, బెంతు, ఒరియా తెగలను ఎస్‌టి కలపాలని చూస్తన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుంజా, సీతారామయ్య, సుబ్బమ్మ, మొట్టుమ్‌, రాజయ్య, ముర్రం రంగమ్మ, సవలం, కన్నయ్య, సవలం, దేశయ్య తదితరులు పాల్గొన్నారు.