కురుపాం: ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతూ, కార్పొరేటర్లకు ప్రభుత్వ రంగ సంస్థలను, అడవులను, ప్రకృతి సంపదను దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యమై తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం తలపెట్టిన సమరభేరి ప్రచారంలో భాగంగా జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ విధానాలపై సంతకాల సేకరణ, ప్రచార కార్యక్రమాలను గురువారం కొనసాగాయి. ఇందులో భాగంగా కురుపాం మండల కేంద్రంలో జరిగిన వారపు సంతలో రెడ్డి వేణు, మండల కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు తో కలిసి ప్రచారం నిర్వహించి సంతకాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని, వీటిని రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు వ్యతిరేకించడం లేదని విమర్శించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు ప్రతి నెలా పెంచుతున్నారని, వీటితో పాటు మరిన్ని ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలభిస్తున్నా యని, వీటికి వ్యతిరేకంగా విపోరాడాలని పిలుపునిచ్చారు. సమరభేరి కార్యక్రమంలో భాగంగా బుధ, గురువారాల్లో సంతకాలు సేకరణ చేపట్టామన్నారు. శుక్రవారం సచివాలయాల వద్ద వినతి పత్రం అందజేస్తామని, 4న తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నా చేపడతామని ఈ కార్యక్రమానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్.సింహాచలం, గౌరీశ్వర తదితరులు పాల్గొన్నారు. అనతరం మండలంలో గుజ్జువాయి పంచాయతీ భారామని, భారమనిగూడ, గూడ కాలనీ, కొత్తగూడ తదితర గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి. వాసు, అంగద, జ్యోతి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ: నగర పంచాయతీ ఎన్.కె రాజపురంలో బిజెపి, వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేపట్టారు. సిపిఎం మండల కమిటీ కన్వీనర్ డి. రమణారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, సంతకాల సేకరణ చేసి సెప్టెంబర్ 1న సచివాలయం వద్ద, సెప్టెంబర్ 4న తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎ.లక్ష్మణరావు, ఎం.రమేష్, జిఎం సుందరరావు, 3, 5 వార్డుల పౌరులు ఎం.రామినాయుడు, సిహెచ్ శ్రీకాంత్, ఎ. వెంకటరమణ, జి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: కేంద, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని పాలకొండ పట్టణం గారమ్మ కాలనీలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, మండల పార్టీ నాయకులు డి. దుర్గారావు, కె. రాము గురువారం ప్రజలు వద్ద సంతకాలు సేకరణ చేపట్టారు.
పార్వతీపురం టౌన్ : ధరలు తగ్గించాలని, ఉద్యోగాలు కల్పించాలని, విద్యుత్‌ఛార్జీలు తగ్గించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో గల 24,25వ వార్డుల్లో ఇంటింటికి వెళ్తూ సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, నాయకులు, బంకురు సూరిబాబు, ముట్నూరు వెంకటరమణ, కొత్తగుండు గణేష్, లాడి అశోక్ కుమార్, రాహుల్, శిరేల మోహన్, మహిళలు పాల్గొన్నారు.
సాలూరు : పట్టణంలోని మహంతి వీధి, నెయ్యిలవీధి, వేగావతీ కాలనీ, బంగారమ్మపేటల్లో సమరభేరి కార్యక్రమంలో భాగంగా సంతకాలు సేకరణ చేపట్టారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్‌వై నాయుడు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కె.వెంకటరావు, మంగమ్మ పాల్గొన్నారు.
సీతానగరం: స్థానిక మార్కెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం సమరభేరి పేరిట సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, కమిటీ సభ్యులు నక్క త్రినాధరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : సమరభేరి కార్యక్రమంలో భాగంగా సొంపిగాం, సారిక, కొత్తూరు గ్రామాల్లో సంతకాల సేకరణ ప్రచార కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సూకురు గంగయ్య, మండల కమిటీ సభ్యులు చింత జోగయ్య, గెమ్మెల బోడమ్మ, సూరయ్య, మెల్లిక కాముడు, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట : సిపిఎం ఆధ్వర్యాన మండల కేంద్రంలో సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యమ్మల మన్మధరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకులు ధరలు రోజురోజుకీ పెంచుతున్నారని, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఉందని ప్రజలపై ఆర్థిక భారాల మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఖండించాలని అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సచివాలయాల ముందు నిరసనలు, సెప్టెంబర్ 4న తహశీల్దారు కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుధా, నాగయ్య, వెంకటరమణ, లక్ష్మణ, సింహాచలం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని రావుపల్లిలో ప్రచారం, సంతకాల సేకరణ జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.మన్మధరావు, నాయకులు గేదెల రామ్మూర్తి నాయుడు. ప్రకాశం. సాంబయ్య. శివ. సింహాచలం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.










