ప్రజాశక్తి - దేవనకొండ
కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపి విధానాలను ఎండగట్టాలని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, మండల నాయకులు మహబూబ్ బాషా కోరారు. శుక్రవారం మండలంలోని కరివేముల, పాలకుర్తి, తెర్నేకల్ గ్రామంలో ప్రచార భేరి నిర్వహించారు. డివైఎఫ్‌ఐ నాయకులు కుంకనూరు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిజెపి విధానాల వల్ల దేశంలోని ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిపిఎం సీనియర్ నాయకులు బజారి, గాజుల శ్రీనివాసులు, కెపి.రాముడు, లక్ష్మిరెడ్డి, నాయకులు రాజశేఖర్ రెడ్డి, శాంతిరాజు, పేతురయ్య, రాముడు పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలంలోని బసలదొడ్డి, పులి కణం, ముచ్చిగిరి, నౌలేకల్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్ మాట్లాడారు. ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కోరారు. వెంకటేష్, వీరన్న, రామిరెడ్డి, నాగప్ప, చిన్న వెంకటేష్, ఆనంద్, గోపాల్, బసవరాజు, నాగభూషణ్, ఈరన్న పాల్గొన్నారు. హోళగుంద మండలంలోని కోగిలతోట, ముద్దటమాగి, సమ్మతగేరి, మునుమానుగుంది, సులువాయి గ్రామాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శులు పెద్దహ్యాట మారెప్ప, రంగన్న, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి సభ్యులు శ్రీరంగ మాట్లాడారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి సలాం సాబ్, రైతు సంఘం నాయకులు మౌలా, సిపిఐ కార్యకర్తలు ఇనహీత్, వెంకన్న, నూర్ల బాష, మస్తాన్, అశోక్, యూసుఫ్ పాల్గొన్నారు.
తెర్నేకల్‌లో ప్రచార భేరి నిర్వహిస్తున్న నాయకులు










