
ప్రజాశక్తి - యంత్రాంగం
మధురవాడ : జివిఎంసి ఏడో వార్డు డాక్‌యార్డు కాలనీ, పాకలలోనూ, ఎఎస్‌ఆర్ నగర్, గణేస్‌నగర్ ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఏడో రోజు ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న కూర్మన్నపాలెంలో నిర్వహించే బహిరంగ సభలో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు డి.అప్పలరాజు, పి రాజుకుమార్, బి భారతి, డి కండమ్మ, సిపిఐ నేత వి సత్యనారాయణ, వి సన్నిపాత్రుడు, పి వెంకన్న, కుమార్ పాల్గొన్నారు.
గాజువాక : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న సాయంత్రం నాలుగు గంటలకు కూర్మన్మపాలెంలో నిర్వహించే బహిరంగసభను విజయవంతం చేయాలని సిపిఎం, సిపిఐ నేతలు కోరారు. పెదగంట్యాడ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బహిరంగసభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు కోవిరి అప్పలరాజు, నమ్మి రమణ, పాల వెంకయ్య, కణితి అప్పలరాజు, జి శ్రీనివాసరావు, కర్రి అప్పలరాజు, నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, కవిటి అప్పలరాజు, సిపిఐ గాజువాక నియోజక వర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, ఎల్లేటి శ్రీనివాసరావు, జి.ఆనంద్, పల్లెటి పోలయ్య, పి. దుర్గారావు , పి.సోమేష్ , కె. మాధవరావు పాల్గొన్నారు..
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపికి గుణపాఠం తప్పదని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. సిపిఎం, సిపిఐ నేతలు ఎం.రాంబాబు, కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తగాజువాక మార్కెట్‌లో ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అప్పారి విష్ణుమూర్తి, జి.ఆనంద్, వై.నందన్న ,పప్పు అప్పారావు, వై.లక్ష్మణరావు, ఎం.రామారావు, పి.ఈశ్వరరావు, పాల్గొన్నారు.
ఆరిలోవ : కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాఆరిలోవ సెక్టార్ -4, భగత్‌సింగ్ నగర్ కాలనీలో ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ గ్రూపు సమావేశాలు నిర్వహించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.రెహ్మాన్ బిజెపి ప్రభుత్వ ప్రయివేటు, కార్పొరేటీకరణ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసి, దేశరక్షణకు మోడీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు వి.నరేంద్రకుమార్, కె.సత్యనారాయణ, శ్రీనివాసరావు, దేవుడమ్మ, కాసుబాబు, లక్ష్మణరావు, గోపి, సన్యాసిరావు పాల్గొన్నారు.
సీతమ్మధార : అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలో సిపిఎం జోన్ కన్వీనర్ రాజు ఆధ్వర్యంలో ప్రచారభేరిపాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రకు పార్టీ నేతలు గౌరీష్, జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని నినదించారు.
ఎంవిపి.కాలనీ : మద్దిలపాలెం ప్రాంతంలో సిపిఎం కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. నాయకులు వి.కృష్ణారావు, ఎల్‌జె.నాయుడు, జివిఎన్.చలపతి, కె.కుమారి, ఎం.చంటి, జివి.రమణ, ప్రదీప్, శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలనూ విపరీతంగా పెంచి, ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాలు మోపుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దెదింపాలని సిపిఎం సీనియర్ నాయకులు వై.రాజు పిలుపునిచ్చారు. ప్రచార భేరిలో భాగంగా పార్టీ జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో కోటవీధిలో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ కరపత్రాలు అందించారు. నాయకులు జి.అప్పలరాజు, కె.సంతోష్ కుమార్, ఎం.సుబ్బారావు, కె.నరసింగరావు, రామారావు, చంద్రమౌళి పాల్గొన్నారు.
కె.కోటపాడు : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని సిపిఎం మండల నాయకులు ఎర్ర దేవుడు అన్నారు. మండలంలోని సింగన్న దొర పాలెం శివారు కొత్తూరు గ్రామంలో గురువారం ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా ఉపాధి కూలీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గడచిన 9 సంవత్సరాలలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అదాని, అంబానీలకు రూ.16 లక్షల కోట్లు దోచిపెట్టిందని తెలిపారు. 2014లో రూ.300 ఉన్న గ్యాస్ ధర నేడు రూ.1200 బిజెపి ప్రభుత్వం పెంచిందన్నారు. రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు మోడీ ప్రభుత్వానికి సలాం చేస్తున్నాయని, విభజన హామీలు అమలు చేయకపోయినా ఆ పార్టీలు మాట్లాడటం లేదని విమర్శించారు. దొంగల జగ్గారావు, వేచలపు దేవుడు బాబు, దొంగల రామలక్ష్మి, దేవుడమ్మ, రామునాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.
రోలుగుంట:ప్రజావ్యతిరేకి బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో రోలుగుంట, రత్నంపేట, శరభవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వ లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, నిత్యావసర ధరలు రోజురోజుకీ పెరుగు తున్నాయన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు. స్టీల్‌ప్లాంట్, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాల అమలు చేస్తున్న బిజెపిని గద్దె దించి బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, లక్ష్మి, ప్రకాష్, జగదీష్ పాల్గొన్నారు.
గొలుగొండ:జోగంపేట, గొలుగొండలో వామపక్షాల ప్రచార బేరిలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, సిపిఎం జిల్లా కమిటీ డి.సత్తిబాబు మాట్లాడుతూ,మోడీ ప్రభుత్వం దేశానికి చేస్తున్న నష్టాన్ని ప్రజలందరికీ వివరించాలన్నారు. పోర్ట్, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి, స్టీల్ ప్లాంట్, బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎ.ల్‌వి.రమణ, సిపిఎం రైతు సంఘం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, సీపీఐ మండల కార్యదర్శి మేకా భాస్కరరావు, ఏఐవైఎఫ్ నాయకులు జి.రాధాకృష్ణ, పి.బాలరాజు, ఎల్.బాబులు, ఎన్.రాంబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.