Apr 16,2023 16:35

ప్రచార బేరిని నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దిప్పేందుకు ప్రజల సిద్ధం కావాలి : సిపిఎం సిపిఐ
పాములపాడు లో ప్రచార బేరి ప్రారంభం
ప్రజాశక్తి - పాములపాడు

    ప్రజలపై పెనుబారాలు మోపుతూ నిరంకుశ పాలను కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం సీనియర్ నాయకులు బి రామేశ్వరరావు మండల కార్యదర్శి సామన్న సిపిఐ మండల కార్యదర్శి ప్రతాప్ సిపిఎం నాయకులు నాయకులు బాలయ్య వెంకటేశ్వరరావు కోరారు పాములపాడు మండలంలోని ఇస్కాల గ్రామంలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాల ను నిరసిస్తూ చేపట్టిన ప్రచార జాత సీనియర్ నాయకులు రామేశ్వరరావు జెండాను ఊపి ప్రారంభించారు మండలంలోని ఇస్కాల ఎర్రగుడురు భానుముక్కుల బానకచర్ల తుమ్మలూరు రుద్రవరం జూటూరు మీదుగా కొనసాగి పాములపాడు మండల కేంద్రంలో బిజెపి విధానాలపై నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ 2014  ముందర అధికారంలోకి రానప్పుడు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి మోసం చేశారని ఆయన మాటల మాంత్రికుడు అని విమర్శించారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర దేశాలలో నల్లధనాన్ని ఉంచారని అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క సామాన్యుని ఖాతాలోకి 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు అన్నారు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటాయని సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు మరో ప్రక్క దేశంలో రైతాంగానికి వ్యతిరేకమైన నల్ల చట్టాలను తెచ్చి వాటిని నిరసిస్తూ పోరాటాలు దిగితే రైతులపై దాడులు చేయడం జరిగిందన్నారు వ్యవసాయ మోటార్లకు బావులకు మీటర్లు బిగించేందుకు పూనుకున్నారని విమర్శించారు.అనేక ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేస్తూ నేడు విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేట్ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు రాయితీలు కార్పొరేట్ వ్యక్తులకు ఇస్తూ సామాన్లపై పెనుబారం మోపుతున్న పరిస్థితి ఉందన్నారు ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు స్థానిక సమస్యలు ఇస్కాల భవనాసి బ్రిడ్జి నిర్మించాలని కోర్స్ అనంతపురం బ్రిడ్జి నిర్మించాలని పాములపాడు మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంతు, ఎస్సార్ రమణ ,జగన్నాధ రావు, ఎం సి నారాయణ ,ఏసేపు, బాల యేసు, మధు, మల్లయ్య, పురుషోత్తము ,చిన్నయ్య, చిలకల ఏసేపు, కాటం. శ్రీను తదితరులు పాల్గొన్నారు