ప్రజాశక్తి-భవానీపురం: కేంద్రంలోని బిజెపి పాలనలో దేశ భవిష్యత్తు అంథకారంగా మారిందని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు అన్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారభేరి కార్యక్రమంలో మంగళవారం భవానీపురం బ్యాంక్ సెంటరు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు తూట్లు పొడుస్తుందన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారన్నారు. పార్లమెంట్లో అదానీ అంశంపై సమాధానం చెప్పమన్నందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడంతో పాటు, నివాసం కూడా ఖాళీ చేయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజా సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, తూనం వీరయ్య, బుద్దే రాజ, ఓర్సు భారతి, చింతాడ పార్వతి, దుర్గాసి రమణమ్మ, డి పుష్ప, ఎం.సాయికుమార్, టి.పూర్ణయ్య, బి.రవి కుమార్, ఏర్రసాని జొసఫ్, రంగారావు, సిపిఎం నాయకులు ఇ.వి.నారాయణ, ఎస్.సుబ్బారెడ్డి, బి.అచేశ్వరావు, శంకర్, కె. సూరిబాబు, కష్ణారెడ్డి, వెంకట్రావు (చౌదరి), మురళి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ఎ.కొండూరు: సిపిఎం, సిపిఐ చేపట్టిన ప్రచారభేరి కోడూరు, మారేపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరావు, సిపిఐ మండల కార్యదర్శి మేకల డేవిడ్, ఎస్‌కె కరీముల్లా, సిపిఎం నాయకులు పానెం ఆనందరావు, ఆళ్ల అమ్మి రెడ్డి, డి.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: మండలంలోని మంగొళ్లు గ్రామంలో ప్రచారభేరి నిర్వహించారు. గ్రామంలో బస్సు స్టాండ్ సెంటర్ నుండి గ్రామపంచాయతీ కార్యాలయం, ఎలిమెంటరీ స్కూలు, లైబ్రరీ సెంటర్, మాజీ సర్పంచ్ బజారు, ఎస్సీ కాలనీ, మసీదు సెంటర్ అంబేద్కర్ సెంటర్, వీఆర్వో కార్యాలయం మీదుగా గ్రామంలో తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బి.రాము, కనకపూడి పటేల్, గ్రామ కార్యదర్శి దేవినేని లక్ష్మీనారాయణ, అన్నేపాక ఏసోబు, కరిసే రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: సిపిఎం, సిపిఐ చేపట్టిన ప్రచారభేరి మంగళవారం అక్కపాలెం, మునుకుళ్ల, రాజుగూడెం, పెద్దవరం గ్రామాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్లు, నాయకులు ఎం.ప్రభాకరరావు, సిపిఐ నాయకులు చిలుకూరి వెంకటేశ్వరరావు, నాగుల మీరా, వన మాలి, పి.రవి తదితరులు పాల్గొన్నారు.










