ప్రజాశక్తి-కాకినాడ కేంద్రంలో బిజెపి పాలనలో దేశంలో ఆర్థిక అంతరాలు పెరగడమే కాకుండా ఆకలి, నిరుద్యోగం కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజశర్మ అన్నారు. స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో రఘుపతి వేంకటరత్నం నాయుడు (ఆర్‌విఎన్) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జి.ప్రభాకర వర్మ అధ్యక్షతన 9 ఏళ్ల బిజెపి పాలన-తీరుతెన్నులు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో అజ శర్మ ప్రసంగించారు. మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో కార్పోరేట్‌లకు మంచి రోజులు, సామాన్యులకు గడ్డు రోజులు వచ్చాయన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయిందిన్నారు. 127 దేశాల ఆకలి సూచికలో మన దేశం 107వ స్థానంలో ఉందంటే దేశంలో ఆకలి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోందన్నారు. సదస్సుకు ముందుగా మాక్సీం గోర్కీ రచించిన అమ్మ నవలను సాహితీవేత్త అద్దేపల్లి ప్రభు పరిచయం చేసారు. ఈ సదస్సులో వివి రమణ, టి.రాజా స్టడీ సర్కిల్ కన్వీనర్ ప్రసాదరావు పాల్గొన్నారు.










