
ప్రజాశక్తి-యంత్రాంగం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ చేపట్టిన ప్రచారభేరి కార్యక్రమం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఉత్సాహంగా సాగుతోంది. బిజెపి అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు.
విశాఖ కలెక్టరేట్ : సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పితానిదిబ్బ, భానోజీ నగర్, న్యూ పితాని దిబ్బ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అన్ని రకాల భారాలూ మోపి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు మాత్రమే మేలు జరుగుతోందని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు వై.రాజు, ఎం.సుబ్బారావు, జి.అప్పలరాజు, కెవిపి చంద్రమౌళి, కె.నర్సింగరావు, కె.చంద్రశేఖర్, సంతోష్ పాల్గొన్నారు.
పెందుర్తి: ప్రచారభేరి పెందుర్తి పాత ఊరు, ఎల్‌ఐసి కాలనీ, సాగర్ కాలనీ, రెల్లి వీధులలో ఉత్సాహంగా సాగింది. సిపిఐ, సిపిఎం నాయకులు కరపత్రాలు పంపిణీ చేసి బిజెపి ప్రభుత్వ దారుణాలను వివరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు జగన్, అప్పలనాయుడ, రమణ, సిపిఐ నాయకులు కె.నారాయణరావు, మల్లేష్, రామారావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు
మధురవాడ : 5వ వార్డు స్వతంత్రనగర్ ప్రాంతంలో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, సిపిఐ జోన్ కార్యదర్శి వి.సత్యనారాయణ, ఎమ్‌డి బేగం, త్రినాథ్, సిపిఎం నాయకులు డి.అప్పలరాజు, డి.కొండమ్మ, బి.భారతి, నారాయణరావు, ఎ.ముసలినాయుడు పాల్గొన్నారు.
కంచరపాలెం : కంచరపాలెంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఒ.అప్పారావు, ఎం.ఈశ్వరరావు, పి.పూర్ణ, వరలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు
ఆరిలోవ : ఆరిలోవ గణేష్ నగర్, లకీëనగర్, ఎఎస్‌ఆర్ నగర్, శివశంకర్‌నగర్‌లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఐ, సిపిఎం నాయకులు మరుపల్లి పైడిరాజు, ఎస్‌కె.రెహ్మాన్, దేవుడమ్మ, కె.లక్ష్మణరావు, శ్రీనివాసరావు, వి.నరేంద్రకుమార్, పి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మాధవధార : జివిఎంసి 51వ వార్డు పరిధి మాధవధార, తెన్నేటినగర్‌లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాత్రపల్లి చంద్రశేఖర్, సిపిఐ ఉత్తర నియోజకవర్గ సహాయ కార్యదర్శి నెయ్యల నాగభూషణరావు, నాయకులు వి.నల్లయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాయనబాబు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.శ్రావణకుమార్, నాయుడుబాబు, సత్యనారాయణ, సత్యవతి, కె.సుధాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక పరిధి దుర్గానగర్, సుందరయ్య కాలనీలో ప్రచారభేరి నిర్వహించారు. సిపిఎం, సిపిఐ నాయకులు ఎం.రాంబాబు, కసిరెడ్డి సత్యనారాయణ, అప్పారి విష్ణుమూర్తి, గంగాధరరావు, డి.శ్రీనివాసరావు, ఎం.తాతబాబు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పెదగంట్యాడ సంతలో ప్రచారభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం స్టీల్‌జోన్ కార్యదర్శి శ్రీనివాసరాజు, నాయకులు రామారావు, జి.శ్రీనివాస్, నమ్మి రమణ, బైరెడ్డి గురప్ప, యు.సోమేష్, పాల అప్పలరెడ్డి సిపిఐ నాయకులు ఎల్లేటి శ్రీనివాసరావు, ఎరిపిల్లి నందన్న, పి.సోమేశ్వరరావు, కారి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకరరావు, సిపిఎం మండల కన్వీనర్ గంట శ్రీరామ్, పార్టీ సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వైఎన్ భద్రం, మాజీ కౌన్సిలర్ తాకాసి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ కూరగాయల మార్కెట్లో ప్రచారభేరి నిర్వహించారు.
తుమ్మపాల గ్రామంలో సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి రాజాన దొరబాబు ఆధ్వర్యంలో ప్రచారభేరి నిర్వహించారు. రూరల్ కార్యదర్శి చెల్లూరి నాగరాజు, వియ్యపు రాజు, డొక్కరి మోహన్, నరాల శెట్టి సత్యనారాయణ, విత్తనాల పోతురాజు, బర్నికాన సాయి, అప్పారావు నాయుడు పాల్గొన్నారు.
మునగపాక రూరల్: బిజెపిని సాగనంపాలని సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు ఎస్ బ్రహ్మాజీ, ఎం మాధవరావు ధ్వజమెత్తారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రచారభేరి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. స్థానిక బైపాస్ జంక్షన్ నుండి ప్రజాపరిషత్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కేంద్రంలోని బిజెపి నిరంకుశ విధానాలు, దానికి తొత్తుగా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆళ్ల మహేశ్వరరావు, టెక్కలి జగ్గా రావు, అల్లారపు భోగేశ్వరరావు, దాడి శివరాం, ఆడారి రామారావు, కొంతం జగదీశ్వరరావు, మల్ల సత్యనారాయణ, మల్ల రామ జోగి, అనంత కుమార్, మళ్ల సతీష్ పాల్గొన్నారు.
దేవరాపల్లి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న పిలుపునిచ్చారు సోమవారం వాలాబులో మండల కార్యదర్శి బిటి అధ్యక్షతన సిపిఎం విస్తృతస్థాయి సమావేశంలో విభజన హామీలను తుంగలో తొక్కడం, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, ఉపాధి చట్టం నిర్వీర్యం, ధరలు పెంపు, గిరిజన గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం తదితర అంశాలలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై భవిష్యత్‌లో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అపుడే దేశానికి రక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మణ, కె.సన్యాసి, సిహెచ్ దేముడు, బి నాగేశ్వరరావు, పి అప్పలరాజు, డి శంకర్, జె ఈశ్వరరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం మండల నాయకులు ఎర్ర దేవుడు అన్నారు. మండలంలోని కింతాడ గ్రామంలో సోమవారం బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టి, దేశాన్ని అథోగతి పాల్జేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. స్టీల్‌ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థ ప్రయివేటీకరణతోపాటు, విభజన హామీలను అమలు చేయక రాష్ట్ర ప్రయోజనాలకు గండికొడుతున్నారన్నారు. కార్యక్రమంలో. కెవిపిఎస్ నాయకులు గాడి ప్రసాదు, సింగంపల్లి చెల్లయ్య. గోపి పాల్గొన్నారు.
గొలుగొండ: కేడిపేట వారపు సంతలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార బేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, ఆదాని, అంబానీ వంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచి పడుతున్న నరేంద్ర మోడీని గద్దె దింపేందుకు ప్రజలంతా ఏకం కావాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిరంకుశంగా కేంద్రం అణిచి వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, రైతు సంఘం జిల్లా నాయకులు మేకా సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్‌వి.రమణ, అల్లూరి జిల్లా నాయకులు నానాజీ, మండల కార్యదర్శి మేకా భాస్కరరావు, ఏఐవైఎఫ్ జి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దెదించి దేశాన్ని కాపాడాలని స్థానిక సిఐటియు నాయకులు డి.సత్తిబాబు పిలుపునిచ్చారు. కృష్ణ బజార్ సెంటర్లో ప్రచార భేరి చేపట్టారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నానాజీ, గోవిందు పాల్గొన్నారు.ఫోటో..... మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు