Apr 12,2023 23:07

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభు త్వాన్ని గద్దె దించి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని సిపిఎం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని సిపిఎం కామ్రేడ్‌ వెలగా లక్ష్మణరావు భవన్‌ కార్యాల యంలో ఆ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి ప్రజావ్యతిరేక విధానా లపై పోరు ప్రచారభేరి గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్‌ డివి కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి కృషి చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదని కార్పోరేట్ల పరంచేస్తూ పేద ప్రజలపై పన్నుల మోత ప్రారంభ మయిందన్నారు. పెట్రోలు డీజిల్‌ ధరలు అమాంతం పెంచేశారని, నిత్యావసర సరుకులు పేద ప్రజలకు వంటింట్లో మంటల మారి పోయిందన్నారు. కడుపునిండా పౌష్టికాహరం తినే పరిస్థితులు పేదవారికి లేకుండా చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎల్‌ఐసి రైల్వే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఇతర సంస్థలన్నింటిని ఆదానీ అబానీలకు కట్టబెడుతూ దేశసంపదను దోచిపెడుతున్నారని వాపోయారు. కేంద్రప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలలో భాగంగా కార్మిక హక్కులు బిజెపి కాలరాస్తోందని ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికుల బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై క్యాంపెయిన్‌లో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్‌, కమిటీ సభ్యులు ఎ విఠల్‌రావు, కొండలరావు, ప్రకాష్‌, బాబ్జీ, నారాయణ, బాషా, వీరయ్య, బేబీ, సరోజిని, పార్వతీ, వెంక్రటావమ్మ, సత్యగౌనీ, రమణమ్మ, మురళీ, కాంతారావు, కామేశ్వరరావు, పాపయ్యనాయుడు, రఘు, శ్రీను, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.