Apr 16,2023 23:23

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు


ప్రజాశక్తి - పెద్దాపురం
బిజెపి ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార జాతా సందర్భంగా ఆదివారం స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార జాతా పోస్టర్‌ ను ఆవిష్కరించారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ అనంతరం బిజెపి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం తీసుకువచ్చి ప్రజలకు పంచుతానన్న వాగ్దానం అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజలపై విపరీతగా భారాలు మోపుతూ కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు బిజెపి ప్రభుత్వం పాటుపడుతుం దన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ జాతా సందర్భంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్‌,కేదారి నాగు,దారపు రెడ్డి క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.