Apr 15,2023 19:55

పోస్టర్లను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

బిజెపి నిరంకుశ పాలనపై ప్రచార యాత్ర

ప్రజాశక్తి - ఆత్మకూరు

కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు ఈనెల 18వ తేదీ నుండి ప్రచార భేరిని చేపడుతు న్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని సుదర్శన వర్మ భవన్‌ నందు ప్రచారయాత్ర పోస్టర్స్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాబాష, ఈఎం. రజాక్‌, స్వాములు, ఏ. సురేంద్ర, షైక్‌ ఇస్మాయిల్‌, సద్దాం హుసేన్‌, మరెన్న, రామ్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

బేతంచెర్ల: ప్రచార భేరి పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్‌ నాయకులు వై. ఎల్లయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై.బి.వెంకటేశ్వర్లు కోరారు. శనివారం స్థానిక పట్టణంలో లారీ మోటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యాలయంలో సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఈశ్వరయ్య, అధ్యక్షతన సిపిఎం ప్రచార భేరి వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వై.ఎల్లయ్య, వై.బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిజెపి నిరంకుశ పాలన నుండి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. విభజన హామీల అమలు, తదితర సమస్యలపై చేసే ఈ పాదయాత్రలో మండల ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌. బాలయ్య,రాజబాబు, నరసింహుడు,నాగరాజు, వన్నూరు,జూనేపల్లి శ్రీను, అంకాలు,రాజు,రామళ్లకోట బాష,కిట్టు,మద్దిలేటి స్వామి, గఫార్‌, కావేటి చిన్న వెంకటేశ్వర్లు,యువరాజు, తదితరులు పాల్గొన్నారు.