ప్రజాశక్తి - యంత్రాంగం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ చేపట్టిన రాజకీయ ప్రచార భేరి యాత్రలు జిల్లాలో సోమవారం కొసాగాయి. ఈ సందర్భంగా ప్రజలకు, ఉపాధి కూలీలకు, కార్మికులకు మోడీ ప్రజావ్యతిరేక విధానాలను కరపత్రాల ద్వారా వివరిస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బిజెపి ప్రజ్యాతిరేక విధానాలను ప్రతిఒక్కరూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి - చింతలపూడి
మోడీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం మండల కన్వీనర్ రామిశెట్టి సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య అన్నారు. సిపిఎం, సిపిఐ దేశరక్షణ ప్రచార భేరి యాత్ర పట్టణంలో సోమవారం సాగింది. కొత్తబస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకూ కరపత్రాలను పంచుతూ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు దొంత కృష్ణ, తుర్లపాటి బాబు, జానీ, సిపిఎం నాయకులు ఎస్.సూర్య కుమార్ పాల్గొన్నారు.
నిడమర్రు : బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి యాత్ర మండలంలో సోమవారం చేపట్టారు. స్థానిక నిడమర్రు సెంటర్‌లో సిపిఐ రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ యాత్రను ప్రారంభించారు. నిడమర్రు, అడవికొలను, ఎనికేపల్లి, భువనపల్లి, మందలపర్రు గ్రామాల్లో ఈ యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, సిపిఎం మండల కన్వీనర్ నారపల్లి రమణరావు, సిపిఎం నాయకులు కె.వెంకట్రావు, కోన శ్రీనివాసరావు, గవర సత్యనారాయణ, ఆర్.నాగరాజు, వెలగలేటి మోహన్, ఆలమండ రాము పాల్గొన్నారు.
ఉంగుటూరు : బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిపిఐ చేపట్టిన ప్రచార భేరీ యాత్రను మండలంలో సాగింది. మండలంలోని నారాయణపురం, ఉంగుటూరు, పెదవెల్లమిల్లి, చేబ్రోలు, గొల్లగూడెం, కైకరం గ్రామాల్లో సాగింది. సిపిఐ రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు దారుణంగా పెంచేశారని విమర్శించారు. మరోవైపు దేశ సంపదను అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తోందన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ నిరసించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధులు కేంద్రమే భరించాలని కోరారు. రైెతులు పండించిన ధాన్యంలో 60 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, సిపిఎం నాయకులు కొక్కెరపాటి వెంకట్రావు, రాచమంటి నాగరాజు, టి.శ్రీను, కోండ్రు చినఅంజయ్య పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : సిపిఎం, సిపిఐ ప్రచారభేరి యాత్ర మండలంలో సోమవారం సాగింది. సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు మొడియం నాగమణి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. మండలంలోని గవరవరం, చొప్పురామన్నగూడెంలోని చెరువుల వద్ద ఉపాధి కూలీల వద్దకు వెళ్లి మోడీ ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందన్నారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి జమ్మి శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్‌కె.బాబ్జీ, సిపిఎం నాయకులు కె.సీతారాములు, సిహెచ్.సత్యనారాయణ, బి.రమేష్ ముళ్లపూడి మధు, దాసరి వీర్రాజు, రేలా అన్నవరం పాల్గొన్నారు. ఎర్రంపేట, గంగన్నగూడెం, తిమ్మనకుంట, రాజవరం, కనకాద్రిపురం, పొంగుటూరు గ్రామాల మీదగా యాత్ర సాగింది.
జంగారెడ్డిగూడెం : సిపిఎం, సిపిఐ దేశ రక్షణ ప్రచార భేరి ప్రచార యాత్ర మండలంలోని గురవాయిగూడెం, పుట్లగట్లగూడెం, దేవులపల్లి, లక్కవరం, పంగిడిగూడెం, కేతవరం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా లక్కవరం-పంగిడిగూడెం చెరువులో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, టివిఎస్.రాజు మాట్లాడారు. ఈ యాత్రలో సిపిఎం మండల కమిటీ సభ్యులు అందుగుల ప్రభాకర్‌రావు, బొడ్డు రాంబాబు, సిపిఐ మండల కార్యదర్శి రమణరాజు, గోలిమే బాలఏసు పాల్గొన్నారు.
పెదపాడు : బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలను నిరసిస్తూ దెందులూరు నియోజకవర్గంలో సిపిఎం, సిపిఐ ప్రచార భేరి యాత్రను ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ తెలిపారు. పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో ప్రచార భేరి యాత్ర పోస్టర్లను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లింగం కృష్ణారావు, గుండపనేని సురేష్, షేక్ కరీముల్లా, రెడ్డి లక్ష్మణరావు, షేక్ బాషా పాల్గొన్నారు.










