బిజెపి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
ప్రజాశక్తి - ఆత్మకూర్
బిజెపి కార్మిక కర్శక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసు రత్నంలు అన్నారు. శనివారం పట్టణంలోని సుదర్శన వర్మ భవనంలో
ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలో జరిగే పోరాట ప్రదర్శనలు జయప్రదం చేయాలని గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్మికులు, రైతుల, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, మతం పేరుతో ప్రజలను విడగొట్టి పరిపాలిస్తు న్నదని అన్నారు. కార్మికులను యజమానులకు బానిసలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్పులు చేసి, కార్మికుల నియామకాలు తొలగింపులో యజమానిష్టారాజ్యం చేసింది అన్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక విధానాలతో వారిని ఆత్మహత్యలకు పురిగొల్పిందన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రదర్శనకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, సిఐటియు పట్టణ కార్యదర్శి రాం నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లు నరసింహ నాయక్, స్వాములు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యద ర్శులు మా బాష, వీరన్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రతాఫ్, తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను విడుదల చేస్తున్న ప్రజా సంఘాల జిల్లా నాయకులు










