Sep 07,2023 20:17

ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

 కడప కేంద్రంలోని నరేంద్ర మోడీ దుర్మార్గ, దుష్ట పాలనకు ప్రజలు అంతం పలికే రోజులు దగ్గరపడ్డాయని పిసిసి మీడియాచైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌. తులసి రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఎర్రముక్కపల్లి సర్కిల్‌, కోటిరెడ్డి సర్కిల్‌ మీదుగా అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు సాగింది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి తులసి రెడ్డి మాట్లాడారు. రాహుల్‌ గాంధీ 2022 సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్‌ జూడో యాత్రకు దేశ ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రీతం రెడ్డి, ఏఐసీసీ సభ్యులు బండి జకరయ్య, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బండి సుమంత్‌ కుమార్‌, ఆర్‌ టి ఐ రాష్ట్ర చైర్మన్‌ కోటపాటి లక్ష్మయ్య, వైస్‌ చైర్మన్‌ అమిర్‌ భాష, కాంగ్రెస్‌ పార్టీ హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా అధ్యక్షులు పాలగిరి శివ, ఎన్‌ ఎస్‌ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ అలీ ఖాన్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు మధు రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, గుండ్లకుంట శ్రీరాములు, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ తిరుమలేష్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.