Sep 06,2023 20:50

సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి

రాయచోటి : బిజెపి చేతిలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లు కీలుబొమ్మలుగా మారారని కాంగ్రెస్‌ పార్టీ మీడియా చైర్మన్‌ ఎన్‌.తుల సిరెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి బజన్‌రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్కభజన నాయుడుగా మారడం శోచనీయమన్నారు. ఇటువంటి నాయకులు ఒకరు ముఖ్యమంత్రిగాను మరొకరు ప్రతిపక్ష నాయకులుగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదష్టమని పేర్కొన్నారు. బిజెపి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ, దుగ్గరాజుపట్నం ఓడరేవు, పోలవరం, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ ఊసే లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎస్‌.అల్లా బకాష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఇలాంటి మోసపూరిత పార్టీలను నమ్మరని రాబోయేది కాంగ్రెస్‌ పార్టీ నేనని ఆయన జోష్యం చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎండి గౌస్‌, చెన్నకృష్ణ, ఖాదరవల్లి, ఖదీర్‌, రమణమ్మ, మహమ్మద్‌ రఫీక్‌, దినకర్‌, నరేష్‌, మైసూరారెడ్డి, ఫరూక్‌, నరేష్‌ దర్బార్‌, ఫారుక్‌, రఫీ, నర్సింహారెడ్డి, ఉత్తన్న, వినరు పాల్గొన్నారు.