Nov 02,2023 22:49

బిజెపి అవకాశవాద రాజకీయలను తిప్పికొట్టాలి : సిపిఎం

బిజెపి అవకాశవాద రాజకీయలను తిప్పికొట్టాలి : సిపిఎం
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : బిజెపి అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌ వెంకటేష్‌ పేర్కొన్నారు. ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర కరపత్రాలను స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద వెంకటేష్‌ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అక్టోబర్‌ 28వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలోని ఆదోని నుంచి బస్సుయాత్ర ప్రారంభమైందని ఈ బస్సు యాత్రకు మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ గఫూర్‌, వికష్ణయ్య నాయకత్వం వహిస్తున్నారన్నారు. ఈ నెల నాలుగో తేదీ ఈ యాత్ర తిరుపతి జిల్లాకు విచ్చేయనున్న సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ప్రజాభేరి బస్సుయాత్రకు సంబంధిం చిన కరపత్రం విడుదల చేశారు. బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు అప్పగిస్తోందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బిజెపికి మద్దతు పలికి రాష్ట్ర అభివద్ధికి ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాల అమలు డిమాండును గాలి కొదిలేశారన్నారు. బిజెపిని ఓటమి పాలు చేసి దేశాభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో ఈనెల 15 తేదీ జరిగే బహిరంగ సభకు ప్రజలు, కార్మిక కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.