May 21,2023 20:25

విట్టా రమేష్‌ను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఓటు బ్యాంకుగా కాకుండా రాజ్యాధికారం దిశగా, బీసీలు హక్కుల సాధనకు ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు కోరారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో దస్తగిరి నాయుడు అధ్యక్షతన బీసీ ఫెడరేషన్‌ డివిజన్‌ నూతన కార్యాలయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విట్టా రమేష్‌ మాట్లాడారు. బీసీలు ఐకమత్యంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగాలని రాబోయే, ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ కులాల వారు ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్ధం కావాలని తెలిపారు. కమిటీ మాజీ సభ్యులు గుడిసె కృష్ణమ్మ, బిజెపి నాయకులు ప్రకాష్‌ జైన్‌, ఆదోని డివిజన్‌ బీసీ ఫెడరేషన్‌ సభ్యులు, బీసీ నాయకులు, బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్‌ ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, గౌరవ సలహాదారులు ఢణాపురం శేషన్న, దేవిశెట్టి ప్రకాష్‌, తాలూకా అధ్యక్షులు మరియాని చెన్న బసప్ప, జనరల్‌ సెక్రటరీ రమేష్‌ ఆచారి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.షేక్షావలీ, గౌరవ సలహాదారులు బండ రాజేశ్వరరావు, కపటి వీరభద్ర, పట్టణ ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనివాసులు, బి.రాముడు, డి.శ్రీనివాసులు, నాగార్జున్‌, బీసీ నాయకులు పాల్గొన్నారు.