ప్రజాశక్తి - బాపట్ల
చట్ట సభల్లో బీసీలకు సమచిత స్థానం కల్పించేందుకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సమాజ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు బీసీ నాయకులుతో కలిసి సోమవారం బాపట్ల డిఆర్ఒ పివి రమణకు స్పందనలో విజ్ఞాపన పత్రం అందజేశారు. సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1996టిడిపి ప్రభుత్వ హయాంలో, 2008లో కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి చట్టసభల్లో బీసీలకు 33.33శాతం రిజర్వేషన్ కల్పించటానికి అవసరమైన మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే 27ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో పార్టీలు మారుతున్నాయి తప్ప చట్టసభల్లో బీసీ వర్గాల రిజర్వేషన్‌పై చర్చ చేపట్టలేదని గుర్తు చేశారు. బిసి రిజర్వేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో తమ సత్తా నిరూపిస్తారని చెప్పారు. కార్యక్రమంలో గొర్ల ఏడుకొండలు, మోర్ల చిన్న వెంకటేశ్వరరావు, కొమ్మనబోయిన వెంకటఫణికుమార్, లంబు సాంబయ్య, నాగూర్, దర్శి చిన భాస్కరరావు పాల్గొన్నారు.