Jun 14,2023 00:42

స్థాఇకులతో మాట్లాడుతున్న బాచిన కృష్ణ చైతన్య

ప్రజాశక్తి-సంతమాగులూరు : రాష్ట్రప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాష్ట్ర శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాచిన కష్ణ చైతన్య తెలిపారు. మండల పరిధిలోని పాత మాగులూరు సచివాలయ పరిధిలోని పుట్టావారిపాలెంలో గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహించారు. తొలుత గ్రామ సర్పంచి సన్నె బోయిన గురు యాదవ్‌ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద కృష్ణ చైనత్యకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కృష్ణ చైతన్య గడప గడపకూ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎనుబర్ల యలమంద, వైసిపి మండల కన్వీనర్‌ చింతా రామారావు, జడ్‌పిటిసి అడవి శ్రీనివాసరావు, నాయకులు అట్లా పెదవెంకటరెడ్డి, దుద్దేల గాలెయ్య, వెంకట్రావు, విప్పల ముసలారెడ్డి, ఓరుగంటి కోటిరెడ్డి, బండి కోటిరెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపిటిసిలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.