Sep 11,2023 00:09

ప్రజాశక్తి - నిజాంపట్నం
బీసీ సంక్షేమ సంఘం రేపల్లె నియోజకవర్గ కన్వీనర్‌గా నగరం మండలానికి చెందిన న్యాయవాది మోర్ల వెంకటకృష్ణను నియమించినట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. మండలంలోని బొర్రావారిపాలెంలో మోర్ల వెంకటకృష్ణకు నియామక పత్రం ఆయన ఆదివారం అందజేశారు. వెంకటకృష్ణకు రాజకీయ, సామాజిక, వర్తమాన అంశాలలో పట్టు ఉందని అన్నారు. బీసీల సంక్షేమం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని శంకరరావు పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని వెంకటకృష్ణ అన్నారు. తనపై నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. బీసీలందరిని సంఘటితపరచి హక్కుల సాధనకు పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు  నాగబాబు, బడుగు వెంకట నారాయణ, ఎం.శివయ్య, కేశన చైతన్య, యేమినేని వెంకటేశ్వరరావు, కేసన శంకర్  పాల్గొన్నారు.