
ప్రజాశక్తి-యర్రగొండపాలెం
బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆదివారం యర్రగొండపాలెంలోని ఆర్‌అండ్‌బి బంగ్లా ఆవరణలో ఆ సంఘం రాష్ట్ర వ్యవహారాల కమిటి చైర్మన్ గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ ఆవిష్కరించారు. బీసీలంతా ఐక్యమై దామాషా ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను, నిధులను, సంక్షేమ పథకాలను సాధించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారు సోమరాజు, నూతన అధ్యక్షులు బలగాని ఆంజనేయులు, నాయకులు నల్లబోతుల శ్రీనివాస్, రంగనాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షులు యాపర్తి వేరయ్య, మండల అధ్యక్షులు పండ్ల బ్రహ్మయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కంచర్ల వెంకయ్య గౌడ్, నియోజకవర్గం కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్లు, మండల యువజన సంఘం అధ్యక్షులు ముటుకూరి వెంకటేశ్వర్లు, పట్టణ యువజన సంఘం అధ్యక్షులు ఎలక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.