తల్లిదండ్రుల విజ్ఞప్తి, విద్యార్థుల భవిష్యత్ కోసమే నిర్ణయం
- విద్యార్థి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు
- పాఠశాల సందర్శనలో నిజ నిర్ధారణ కమిటీ బందం వెల్లడి
ప్రజాశక్తి -ఖాజీపేట
మండల పరిధిలోని కొత్త నెల్లూరు సమీపంలో బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సోహిత్(11) శనివారం అనుమానాస్పదంగా మతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మతి ఘటనకు సంబంధించి నిజా నిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఐదుగురు ఉన్నత అధికారులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో కమిటీ బృందం ఆదివారం పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోహెత్ మతి ఘటనకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విచారించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాల కర స్పాండెంట్, ప్రిన్సిపల్, వసతిగహ వార్డెన్, విద్యార్థుల తల్లిద ండ్రులను నుంచి వివరాలు తెలుసుకొని ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికుల ఆందోళన, పాఠశాల యాజమాన్యం స్పందిం చకపోవడం వంటి కారణాలతో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ డిఇఒ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ప్రస్తుతం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు, విద్యార్థుల భవిష్యత్ ఆకాక్షించి పాఠశాల గుర్తింపును తాత్కాలికంగా నిలుపుదల చేశామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీ నివేదిక, విద్యార్థి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలుంటాయని తెలిపారు. తల్లిదండ్రులను ఫోన్‌ద్వారా సంప్రదించి వారి అభిప్రమాయాలను తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు చెప్పారు. విదా ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలను కొనసాగించాలని తల్లి దండ్రుల సమావేశంలో చాలామంది కోరారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి చర్యలు చేపడుతామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ పట్ల ఎలాంటి సందేహం పెట్టు కోవద్దని పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీలో డిప్యూటీ డిఇఒ రాజగోపల్‌రెడ్డి, ఏడీ దేవరాజు, మండల విద్యాశాఖాధికారులు నాగస్వర్ణలత, సత్య నాగరాజు ఉన్నారు.










