బీమా సహయాన్ని పంపిణి చేస్తున్న సర్పంచ్ తులసమ్మ,వైస్ ఎంపిపి
బీమా తక్షణ సహాయం పంపిణీ
ప్రజాశక్తి - చాగలమర్రి
చాగలమర్రి పట్టణంలోని 2వ వార్డులో నివాసముంటున్న దూదేకుల మాబున్ని(42) ఇటీవల మృతి చెందింది. బాధిత కుటుంబానికి వైఎస్సార్ బీమా తక్షణ సహాయం కింద రూ 10 వేలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తులసమ్మ, వైస్ ఎంపిపి రఫి సోమవారం అందజేసారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యనిర్వహణాధికారి సుదర్శనరావు మాట్లా డుతూ వైఎస్సార్ బీమా చేసిన వారు సహజ మరణం చెందితే లక్ష రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అందులో భాగంగా తక్షణ ఆర్థిక సహాయంగా రూ 10 వేలు మృతురాలి కుటుంబ సభ్యుల కు అందజేసామన్నారు. మిగతా మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్పేర్ సహాయకులు వెంకట్ పాల్గొన్నారు.










