
ప్రజాశక్తి - తణుకు రూరల్
బీమా ప్రీమియంలపై జిఎస్‌టిని రద్దు చేయాలని ఎల్‌ఐసి ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జోనల్ జనరల్ సెక్రెటరీ పిఎల్.నరసింహారావు డిమాండ్ చేశారు. గురువారం ఏజెంట్స్ డిమాండ్స్ డే సందర్భంగా ఎల్‌ఐసి బ్రాంచి వద్ద ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. ఇ-బీమా పాలసీలను ఆపాలని, కమిషన్ పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు. డైరెక్ట్ మార్కెటింగ్ ఆపాలని, గ్రూప్ ఇన్స్యూరెన్స్ లిమిట్ పెంచాలని, ప్రీమియం తగించాలని, గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ లిమిట్ పెంచాలని, గ్రాడ్యుటీని పెంచి, క్యాలిక్యూలేషన్ విధానంలో మార్పు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఏజెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు బ్రాంచి ఎల్‌ఐసి ఎఒఐ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు సలాది ఉదయభాస్కర్‌రావు, సెక్రటరీ మడిచర్ల రవిరామకృష్ణ, ట్రెజరర్ నార్కెడమిల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాస్, నాయకులు సుందరం ఆచారి, నార్ని వీరవెంకటరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.