ప్రజశక్తి - చీరాల
మండలంలోని ఈపురిపాలెం పంచాయతీలోని 3వ సచివాలయం పరిధిలో పీర్ల చావడి వద్ద నివాసం ఉంటున్న షేక్ హుస్సేన్ అనారోగ్యంతో మృతి చెందారు.అయితే గురువారం ఆ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద వైయస్ ఆర్ భీమా కింద నామినికు షేక్ జహీరున్ కు రు.10వేలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ షేక్ నూర్ మహమ్మద్, మండలం మాజీ కో ఆప్షన్ సబ్యుడు షేక్ మస్తాన్, వెల్ఫేర్, అందె ప్రవీణ్ వాలంటీర్ షేక్ ఎంఎన్ షరీఫ్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనారు.










