Jul 13,2023 21:51

బీడీ వ్యాపారం తగ్గు ముఖం

ప్రజాశక్తి - రాయచోటి
ఒకప్పుడు రాయచోటి ప్రాంతంలో బీడీల తయా రీకి పెట్టిందిపేరు. వ్యాపారం కూడా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగేది. బీడీ ఫ్యాక్టరీలను నమ్ముకుని చుట్టు పక్కల ప్రజలు ఉపాధి పొందేవారు. రానురానూ వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో ఫ్యాకర్టీ యాజమాన్యాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలోని ఆరు నియో జకవర్గాల్లో నేడు బీడీ పరిశ్రమలు కనుమర ుగయ్యాయి. ప్రస్తుతం కేవలం ఒక రాయచోటిలో మాత్రమే 12 బీడీ ఫ్యాక్టరీలున్నాయి. ఫ్యాక్టరీల వల్ల కొంతమంది కార్మిక కుటుం బాలు మాత్రమే జీవనం సాగిస్తున్నాయి. కానీ బీడీ ఆకు చుట్టడానికి నేడు కార్మికుల కరువయ్యారు.ఉన్నవారితో పని చేస్తున్నప్పటికీ అనుకున్నంత వ్యాపారం సాగడం లేదని బీడి ఫ్యాక్టరీ నిర్వాహకులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని భద్రాచలం, తేజర ప్రాంతాల నుంచి పౌడర్‌, పొగాకు తీసుకువచ్చి వాటిని శుభ్రం చేసి బీడీలుగా చుట్టి మార్కెట్లోకి విక్రయిస్తున్నామని చెప్పారు. కార్మికులు గతంలో మాదిరిగా ఫ్యాక్టరీలో పనిచేసేందుకు ముందుకు రాకపోవడంతో అనుకున్నంత ల క్ష్యంలో బీడీల తయారీ తగు ముఖం పట్టింది. కేవలం 45 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక్క డి నుంచి బీడీలను రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లి, పెద్దమండెం ,చిన్నమండెం ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కార్మిక శాఖ అధికారులు బీడీ ఫ్యాక్టరీలో వైద్యం సౌకర్యం, గుర్తింపు కార్డులు అందించాలని కార్మికులు కోరుతున్నారు. బీడీ ఆకుపై జిఎస్‌టి ఎత్తేస్తే రాబోవు రోజుల్లో బీడీ వ్యాపారం పెరిగి మరిన్ని పరిశ్రమల స్థాపనకు అవకాశముంటుందని ఫ్యాక్టరీ యజమానులు పేర్కొంటున్నారు. బీడీ ఆకుపై కేంద్రం, రాష్ట్ర్ర ప్రభుత్వాలు జిఎస్‌టి వేయడం వల్ల వ్యాపారానికి పెనుబారంగా మారిందిని ఫ్యాక్టరీ యాజమానులు చెబుతున్నారు. రాయచోటిలోని అన్ని ఫ్యాక్టరీలకు లైసెన్సులు ఉన్నప్పటికీ

అందులో పని చేసేందుకు కార్మికులు మొగ్గు చూపకపోవడంతో బీడీ ఫ్యాక్టరీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉన్నాయి. కూలి తక్కువగా ఉందని కొందరు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని మరికొందరు కార్మికులు పనిచేసేందుకు ముందుకు రావడం లేదని యజమానులు పేర్కొంటున్నారు. గతంలో పనిచేసేవారితోనే పనిచేయిం చుకుం టున్నామని, కొత్తవారు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయారు. బీడీ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు హెల్త్‌కార్డు, గుర్తింపు కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
బీడీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. పొగాకుతో బీడీలు రోజూ చుట్టడం వల్ల అనేక ఆరోగ్య సమ స్యలు కూడా వస్తున్నాయి .ప్రభుత్వం కులవత్తిదారులకు ఇస్తు న్నటువంటి వేతనం కార్మికులకు ఇవ్వాలి. పెన్షన్‌, హెల్త్‌కార్డులు ఇవ్వాలి.
-జఫీవుల్లా, కార్మికుడు, రాయచోటి
నూతన ఫ్యాక్టరీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
ఎవరైనా జిల్లాలో నూతన బీడీ ఫ్యాక్టరీలు నిర్మిం చుకోవాలంటే మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి లైసెన్సులు మంజూరు చేస్తాం. బీడీ కార్మికులందరు ఇన్సూరెన్స్‌ కార్డులు దరఖాస్తు చేసుకోవాలి.
- డి.వి. రంగరాజు , కార్మిక శాఖ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి, అన్నమయ్య జిల్లా.బీడీలు చుడుతున్న కార్మికులు