ప్రజాశక్తి-నెల్లూరు : టిడిపి యువజన నాయకులు 47వ డివిజన్ ఇన్‌ఛార్జి ధర్మవరం గణేష్ కుమార్ ఆద్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర త్వరగా కోలుకోవాలంటూ 101 టెంకాయలతో పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మవరం గణేష్ మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర రాజకీయాలలో యువగళం పాదయాత్రలో ఎంతో చురుకుగా నిరంతరం కష్టపడుతూ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తమ ప్రియతమ నాయకులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదరవిచంద్ర ప్రమాదవశాత్తు గాయపడ్డారన్నారు. నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన త్వరగా కోరుకోవాలని పూజుల చేపట్టారు. కల్వకుంట భాస్కర్ ,కొత్తూరు రమణయ్య , రాళ్ల సురేష్ , సరోజనమ్మ , కోటపాటి రాజ , అద్దంకి చంద్రశేఖర్ , సిద్దకళాచారి , గోపి రమేశ్ , చంద్ర , సురేంద్ర సింగ్ , శివ , సుదా , మన్నార్ స్వామి, చిన్నసాయి యాదవ్ , మహిళలు టిడిపి కార్య కర్తలు పాల్గొన్నారు.










