Nov 13,2022 23:28

ఎన్నికైన కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-గొలుగొండ:మండల కేంద్రంలో బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్‌ బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో మండల కమిటీ ఆదివారం ఎన్నికైంది. బిఎస్పీ మండల ప్రెసిడెంట్‌గా కుందేటి పట్టాలు, వైస్‌ ప్రెసిడెంట్‌గా మోసురి నూకరాజు, కార్యదర్శిగా మేలిపాక శివ, గౌరవ అధ్యక్షులుగా కాపారపు అప్పారావు, కన్వీనర్లుగా వారా నూకరాజు, పోలోజు నాగేష్‌, కార్యవర్గ సభ్యులుగా సుమారు 15మంది వివిధ గ్రామాలకు సంబందించిన వారు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఎన్‌.చిరంజీవి, సంజీవ్‌ వాడపల్లి, కొల్లు గంగాధర్‌, పాడి బాలరాజు, నైదాన నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.