నిరసన తెలుపుతున్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు
ప్రజాశక్తి- కలెక్టరేట్, విశాఖ : బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ ఇవ్వరాదని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం డాబాగార్డెన్స్‌లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యాన భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2017 జనవరి 1 నుంచి పేరివిజన్ అమలు చేయాలని, అదే తేదీ నుంచి పెన్షన్ రివిజన్ కూడా జరగాలని, స్టాగేషన్ సమస్య పరిష్కరించాలని, 4జి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్.సత్యనారాయణ, బి.లక్ష్మీనారాయణ, రామచంద్రరావు, పిఇ సిహెచ్‌వి.సాగర్ పాల్గొన్నారు.










