ప్రజాశక్తి-కంచరపాలెం : BNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొట్టా నర్సింగరావు 18వ వర్ధంతి సందర్బంగా తోట వీధి - కంచరపాలెం మెయిన్ రోడ్డు మీద మజ్జిగ కేంద్రం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ మజ్జిగ కేంద్రాన్ని గొల్ల కంచరపాలెం గ్రామ ప్రెసిడెంట్ పళ్ళ. సత్యనారాయణ ప్రారంభించారు. అయన మాట్లాడుతూ బొట్టా నర్సింగరావు వార్డు కార్పొరేటర్ గా అనేక సేవలందించి ప్రజలు మనిషిగా పేరొందారు. అయన లేని లోటు కంచరపాలెం ప్రాంతానికి తీరని లోటని అన్నారు. BNR ఫౌండేషన్ నాయకులు కొయ్య వెంకటప్పారావు, కొయ్య జగదీశ్, ఉప్పిలి. పోలరావు ఆర్ధిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, s.అప్పలరాజు, s.సోమేశ్వరావు, p.వెంకట రావు, యలమంచిలి. వెంకటరావు, నమ్మి నాగరాజు, ధర్మరాజు, సీపీయం పార్టీ సీనియర్ నాయకులు స్వతంత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.










