Oct 30,2023 23:21

మాట్లాడుతున్న తహశీల్దారు

ప్రజాశక్తి-శింగరాయకొండ : బిఎల్‌ఒలు ఓటు నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు సిహెచ్‌.ఉష తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బిఎల్‌ఒలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ ప్రతి ఓటు విషయంలో బిఎల్‌ఒలు పూర్తిస్థాయిలో పరిశీలించి సమాచారం తమ వద్ద ఉంచుకోవాలన్నారు. నవంబర్‌ 4, 5 తేదీల్లో బిఎల్‌ఒలు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద అందుబాటులోఉండాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బిల్‌ఎల్‌ఒ అప్రమత్తంగా ఉండాలన్నారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు తన్నీరు వెంకటేశ్వర్లు, బిఎల్‌ఒలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.