Nov 01,2023 23:01

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
స్థానిక తహశీల్దారు  కార్యాలయము నందు బిఎల్ఒలు, సూపర్వైజర్లలకు ఎస్‌ఎస్‌ఆర్‌-2024పై సమీక్ష సమావేశం బుదవారం నిర్వహించారు. సమావేశంలో అందరు బిఎల్‌ఒలకు ఫారం-6, ఫారం-7, ఫారం-8 అప్లికేషన్స్ గురించి వివరించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ప్రకారం ఈనెల 4, 5తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు రోజుల పాటు బిఎల్‌ఒలు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు   పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండి  ఫారం-6, 7, 8అప్లికేషన్లు  స్వీకరించాలని అన్నారు. సమావేశంలో తహశీల్దారు పి బ్రహ్మయ్య, బిఎల్‌ఒలు, సూపర్వైజరులు పాల్గొన్నారు.