Aug 12,2023 16:52

ప్రజాశక్తి - పెదపాడు
     పెదపాడు ఎండిఒ ఆఫీస్‌ నందు డోర్‌ టూ డోర్‌ ఓటర్స్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమంపై జివివి సత్యనారాయణ, ఇఆర్‌ఒ, డివై కలెక్టర్‌ కెఆర్‌సిసి ఏలూరు వారు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బిఎల్‌ఒలకు డోర్‌ టూ డోర్‌ ఓటర్స్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై తగు సూచనలు తెలియజేశారు. ఈనెల 21వ తేదీ నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు తహశీల్దార్‌ జి.విజయకుమార్‌ రాజు, డివై తహశీల్దార్‌ ఎన్‌డివి ప్రసాద్‌బాబు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.